మలయాళ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో పహద్ ఫాజిల్ ఒకరు . ఈయన ఇప్పటి వరకే ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి మలయాళ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ కలిగిన నటుడుగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు . ఇకపోతే ఫాహధ్ కొంతకాలం క్రితం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 1 మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. 

ఈయన ఈ సినిమాలో చాలా తక్కువ నడివి ఉన్న పాత్రలోనే కనిపించినప్పటికీ ఆ తక్కువ సమయంలోనే ఈయన తన అద్భుతమైన విల నిజంతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. ఈ సినిమాతో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు ఏర్పడింది. ఇక ప్రస్తుతం ఈ నటుడు పుష్ప పార్ట్ 2 మూవీ లో నటిస్తున్నాడు. ఇందులో ఈయన పాత్ర నిడివి చాలా ఎక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈయన మలయాళం లో రూపొందిన ఆవేశం అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు.

మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని పహాధ్ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయిన తాజాగా "ఓ టి టి" లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" సంస్థ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ని మలయాళం లో అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ స్ట్రీమింగ్ చేస్తోంది. మరి ఈ మూవీ డిజిటల్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: