పన్నా జిల్లా లోని ప్రకాష్ మజుందార్ అనే వ్యక్తి శుక్రవారం రోజు జరువాపూర్ అనే గ్రామంలో గనిలో త్రవ్వకాలు జరిపినప్పుడు, 6.47 క్యారెట్ల బరువు కలిగిన వజ్రాన్ని కనుగొన్నట్లు వజ్రాల అధికారి నూతన జైన్ తెలిపాడు. ప్రస్తుతం దీనిని వేలంపాటలో వుంచి, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ధర నిర్ణయించబడుతుంది అట. అంతేకాదు వేల నుండి వచ్చిన మొత్తాన్ని గనిలో క్వారీ చేసినవారిలో పాల్గొన్న మొత్తం నలుగురు భాగస్వాములతో డబ్బులను పంచుకుంటాము అని మజుందార్ తెలిపారు..
మజుందార్ మాట్లాడుతూ .. మేము ఐదుగురు భాగస్వాములను ఉన్నాము. తవ్వకాలు జరుపుతున్నప్పుడు 6.47 క్యారెట్ల బరువు కలిగిన వజ్రం దొరకడం జరిగింది. ఇక దీనిని ప్రభుత్వం డైమండ్ కార్యాలయంలో డిపాజిట్ చేసాము " అని ఆయన శుక్రవారం పత్రికా విలేకరులతో మాట్లాడారు.
పన్నా జిల్లాలో 12 లక్షల విలువ గలిగిన క్యారెట్ల వజ్రం నిల్వలు ఉన్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇక్కడ కొంత భూమిని ఏర్పాటుచేసి, ఆ భూమిలో దొరికే వజ్రాలను జిల్లా మైనింగ్ అధికారి వద్ద డిపాజిట్ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి