ఒక్కొక్కరికి ఒక్కో విధమైన ఆలోచన ఉంటుంది. ఎవరి ఇష్టానుసారం వారు చేస్తుంటారు. ఒకరు కుక్కని పెళ్లి చేసుకుంటారు. కొంతమంది బొమ్మలను  పెళ్లి చేసుకుంటారు. ప్రస్తుతం సమాజంలో ఎవరు స్వేచ్ఛ వారిది. అలాగే ఈమె చెట్టును పెళ్లాడింది. ఆమె చెట్టును  పెళ్లి చేసుకోవడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి అంటోంది.  మరి అది  ఎక్కడ జరిగిందో తెలుసుకుందామా..?

ఇంగ్లాండ్ కు చెందిన ఓ మహిళా 2019లో చెట్టును పెళ్ళిచేసుకుంది. ప్రాణంలేని ఆ చెట్టుతో అన్యోన్యంగా గడుపుతున్న ఆమె తమ ఇద్దరి మధ్య బంధం మరింత బలపడిందని, ప్రస్తుతం చెట్టుతో కలిసి మూడో సారి  క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నట్లు చెప్పింది. మెర్సీ సైడ్, సెప్టన్ లోని రిమ్రోస్ వ్యాలీ కంట్రీ పార్క్ వద్ద గల చెట్టును కేట్ కన్నింగమ్ అనే మహిళ వివాహం చేసుకుంది. అంతేకాదు పార్ట్నర్(చెట్టు) అంటే చెప్పలేనంత ఇష్టం కాగా, వారానికి ఐదు సార్లు తనతో టైం స్పెండ్ చేస్తుంది. దానిపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచేందుకు క్రిస్మస్ సందర్భంగా పుష్పాలు, టిన్సెస్, బబుల్స్ తో చెట్టును అందంగా అలంకరించింది కూడా. ఇక కేట్ బాయ్ ఫ్రెండ్ కూడా చెట్టుతో ఆమె సంబంధాన్ని అన్ని విధాలుగా సమర్ధిస్తున్నాడు.

కేట్ తన భర్త (చెట్టు)ను చూడాలనుకుంటే అతను కూడా తోడుగా వెళుతుంటాడు. ఆమె చెట్టుకు  ముద్దులిస్తూ, కౌగిలించ్చుకునేటప్పుడు పక్కనే నిలబడతాడు. కాగా లాక్ డౌన్ టైంలో ఈ బంధం మరింత బలపడిందని కేట్ వెల్లడించింది.కాగా చట్టవిరుద్ధంగా చెట్లను నరకడం వంటి అంశాలపై అవగాహన పెంచేందుకు మెక్సికోలోని మహిళా కార్యకర్తలు అనేక రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తుంటారు.ఆ ప్రయత్నాల నుంచి ప్రేరణ పొందిన కేట్ చెట్టుతో వివాహం చేసుకుంది.రిమ్రోస్ వ్యాలీ కంట్రీ పార్కును ఇంగ్లాండ్ హైవేస్ కు సంబంధించి బైపాస్ గా మార్చకుండా కాపాడే ప్రచారానికి వీలుగా తన వివాహం అందరి దృష్టిని ఆకర్షిస్తోందని ఆమె ఆశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: