వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి అనే పేరు వినగానే ప్రజల గుండెల్లో ఒక చప్పుడు వినిపిస్తుంది. ముఖ్యంగా నిరుపేదలకు సేవ చేసిన వైద్యుడిగానే కాకుండా కుల,మత ప్రాంతాలకు కూడా అతీతంగా నీరాజనం అందుకున్న మహా నాయకుడుగా పేరు సంపాదించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఒక చెరగని ముద్ర వేసుకున్న మాస్ లీడర్ గా పేరుపొందారు రాజన్న.. ముఖ్యంగా ఆయన కట్టే తెల్లకట్టు పంచ నిండైన ఆహారం అన్నివేళల చిరునవ్వు చెప్పిన మాట కోసం ఎక్కడికైనా వెళ్లే ధైర్యం సహాయం కోరి వచ్చిన వారిని కాదనకుండా పంపించడంతో ఈయన పేరుతో పాటు జనంలో కూడా మంచి పేరు సంపాదించారు.


రాజశేఖర్ రెడ్డి గారికి ఎందుకంత ప్రజలలో మమకారం అంటే తన మొదటి సంతకం రైతులకు ఉచిత విద్యుత్ హామీ ఇవ్వడమే అన్నట్లుగా పెట్టడం జరిగింది. తన తొలి సంతకం తోనే ప్రజల గుండెల్లో నిలిచిపోయారు ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు చేరువవుతూనే ఉన్నాయి.

పై చదువులు చదివే విద్యార్థుల కోసం ఫీజు రిమెంబర్స్ అనే పథకాన్ని పెట్టడం వల్ల నిరుపేద కుటుంబీకులు కూడా పై చదువులు చదువుకోవడం జరుగుతోంది.


అత్యవసర వైద్యం కోసం 108 అంబులెన్స్ ప్రవేశపెట్టడమే కాకుండా కార్పొరేట్ ఆసుపత్రులలో కూడా నిరుపేదలకు ఖరీదైన వైద్యాన్ని కూడా అందించడం కోసం ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు.


మహిళా సంఘాలకు చేనేత కార్మికులకు పావుల వడ్డీకే రుణాలను అందించేలా చేశారు.


ముఖ్యంగా నిరుపేద కుటుంబీకులకు రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని కూడా మొదట ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు అయినప్పటికీ ఆ తరువాత వచ్చిన పథకాలన్నీ కూడా అట్టకెక్కాయి దీంతో మళ్ళీ రాజశేఖర్ రెడ్డి 2 రూపాయలకే కిలో బియ్యాన్ని ఇవ్వడం జరిగింది.


ఇక ఇందిరమ్మ ఇల్లు కింద ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టించి కొన్ని లక్షల మందికి శాశ్వతంగా గుండెల్లో దేవుడిగా నిలిచారు.

ఇలా మరెన్నో పథకాలను చేపట్టిన వైయస్సార్ అందుకే ప్రజలలో చెరగని ముద్ర వేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: