
అమెజాన్ అడవులు ఎక్కువగా ఎప్పుడు చాలా దట్టంగా ఉంటాయి. ముఖ్యంగా అమెజాన్ అడవి మధ్య పారుతున్నటువంటి ఒక నదిలో భారీ అనకొండ ఈదుకుంటూ వెళుతున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నది. ఈ వీడియోని హెలికాఫ్టర్ నుంచి చిత్రీకరించినట్లు చాలా క్లియర్ గా కనిపిస్తున్నది. నదిలో అనకొండ ఈదుకుంటూ వెళుతున్న ఒక దృశ్యం వీడియో నేటిజెన్లను సైతం ఆకట్టుకుంటున్నప్పటికీ ఎంతో దూరం నుంచి చూస్తేనే అనకొండ నదిలో ఎంత పెద్దగా కనిపిస్తోందో ఇక దగ్గర్నుంచి చూస్తే అంతే అన్నట్టుగా అనకొండ కనిపిస్తోంది.
అంత భారీ అనకొండ నీటిలో మాత్రం వేగంగానే ముందుకు వెళ్తోంది..దాని భారీ ఆకారాన్ని చూసి చాలామంది నెటిజెన్స్ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వీడియో చూసిన పలువురు నెట్టిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నప్పటికీ కొంతమంది హాలీవుడ్ సినిమాలు చూపించినట్టుగానే ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే మరి కొంతమంది ఇది ఫేక్ వీడియో కావచ్చు అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా మొత్తానికి అమెజాన్ అడవులలో ఇంత పెద్ద భారీ అనకొండను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. గతంలో కూడా ఇలాంటి ఎన్నో వీడియోలు వైరల్ గా మారాయి. ఇప్పుడు మరొకసారి.