ఎస్ ప్రెసెంట్ అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటేనే భయపడిపోతున్నారు. ఒకప్పుడు పెళ్లంటే అమ్మాయిలు భయపడి పోయే వాళ్ళు. ఇన్నాళ్లు పుట్టింటిలో గారాబంగా పెరిగి సడన్గా అత్తగారింటికి వెళ్లితే..అక్కడ ఎలా ఉండాలి..? ఎలా ఉంటుందో..? అమ్మ లా చూసుకునేవారు ఉంటారా..? నాన్న లా ఆదరించే మామ ఉంటాడా..? అర్ధం చేసుకునే విధంగ భర్త ఉంటాడా..?  అని చాలామంది పెళ్లంటే భయపడిపోయి దూరం దూరంగా ఉండేవారు.

కానీ రాను రాను ఇప్పుడు పెళ్లంటే అబ్బాయిలు భయపడిపోతున్నారు . దానికి మరీ ముఖ్యంగా కారణం రీసెంట్గా జరిగిన ఓ ఇన్సిడెంట్.  "మేఘాలయ హనీమూన్"  కోసం వెళ్ళిన జంట మిస్సైంది అన్న వార్త మొన్నటి వరకు ఎలా ట్రెండ్ అయిందో ..దాని గురించి జనాలు ఎలా మాట్లాడుకున్నారో అందరికి తెలిసిందే. నిన్న మొన్నటి వరకు "మేఘాలయ హనీమూన్" కేసులో అందరు ఆ భార్య ని పాపం అని జాలి పడేవారు. ఆ తర్వాత ఆ హనీమూన్ కపుల్ కి సంబంధించిన ఒక్కొక్క విషయం బయట పడుతూ ఉండే కొద్ది..అస్సలు నిజం బయటకి వచ్చింది.

అబ్బాయిల వెన్నులో వణుకు పుడుతుంది . నిన్న మొన్నటి వరకు పాపం ఆ హనీమూన్ కపుల్ అంటూ మాట్లాడుకునే వాళ్ళు ఆ తర్వాత మొగుడిని చంపింది ఆ భార్యను అంటూ బయటికి రావడంతో ఒక్కసారిగా జనాలు ఉలిక్కిపడ్డారు.  అంత అమాయకంగా కనిపించే ఆవిడ మొగుడ్ని చంపేసిందా..? అంటూ బూతులు తిట్టడం ప్రారంభించారు . మేఘాలయ హనీమూన్ జంట మిస్టరీ మిస్సింగ్ ఎపిసోడ్లో రోజు కి ఓ విషయం బయటపడుతూ వస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఇష్యూ ని సోషల్ మీడియాలో హైలెట్ చేస్తూ కొంత మంది అబ్బాయిలు మాట్లాడుకుంటున్నారు.

ఒకరు కాదు ఇద్దరు కాదు వందలో 60 శాతం మంది అబ్బాయిలు పెళ్లంటే భయపడిపోతున్నారు . కేవలం ఈ ఒక్క ఇన్సిడెంట్ మాత్రమే కారణం కాదు.  ఇంతకుముందు కూడా చాలామంది ప్రేమించేది ఒకరిని పెళ్లి చేసుకునేది ఒకరిని అంటూ అబ్బాయిలు మాట్లాడుకునేవారు . మరి ముఖ్యంగా జాబ్ కోసం వేరే స్టేట్స్ కి వెళ్తూ అక్కడ సరదాగా బాయ్ ఫ్రెండ్ ని ఒకరిని మైంటైన్ చేసి ఫైనల్ గా ఇంట్లో పెద్దలు  కుదిరిచిన సంబంధాన్ని చేసుకుంటూ ఒక పక్క బాయ్ ఫ్రెండ్ ని మైంటైన్ చేస్తూ నే మరోక పక్క మొగుడిని టార్చర్ పెడుతున్నారు కొంతమంది అమ్మాయిలు అంటూ మాట్లాడుకుంటున్నారు.

కొంతమంది పెళ్లి అన్న పదాన్ని ఈ విధంగా బ్రష్టు పట్టిస్తున్నారు అంటూ ఘాటు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు . అందరూ ఆడవాళ్ళు ఇలానే ఉన్నారంటే కానే కాదు . భర్త అంటే ప్రాణం ఇచ్చే భార్యలు ఉన్నారు. వందలు 30 శాతం మంది మాత్రమే ఇలా ఉన్నారు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో భర్తలను చంపేసే భార్యల లిస్టు ఎక్కువగా మారిపోయింది అని ఇలాంటివి చూస్తున్నప్పుడు అసలు పెళ్లంటేనే భయం వేస్తుంది అని కొందరు మగాళ్లు భయపడిపోతున్నారు,  అదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా కమెంట్స్ రూపంలో బయటపెడుతున్నారు..!!

నోట్: ఇక్కడ అందించిన సమాచారం కేవలం  సోషల్ మీడియాలోని కొన్ని కామెంట్స్ ఆధారంగా అందించబడినది. అంతేకానీ ఇందులో ఎవ్వరిని కించపరచాలి అనే ఉద్దేశ్యంతో ఇవ్వబడినది కాదు. ఎవరి నమ్మకం వారిది . ప్రతి ఒక్కరికి ఒక్కో వ్యక్తిగత అభిప్రాయం ఉంటుంది అనేది పాఠకులు గుర్తుంచుకోవాలి..!!


మరింత సమాచారం తెలుసుకోండి: