గుడ్లలో రోగనిరోధక వ్యవస్థ,నాడీ వ్యవస్థను నిర్మించడానికి అవసరమైన విటమిన్ డి మరియు విటమిన్ బి-12 కూడా ఉంటాయి.అలా అని ఉడికించని గుడ్లు తినడం లాంటివి చేయకూడదు. గర్భధారణ సమయంలో ఉడికించిన గుడ్లు మాత్రమే తినాలి.ఎందుకంటే ఇలా ఉడకబెట్టడం వల్ల గుడ్డులో ఏదైనా హానికరమైన బ్యాక్టీరియా ఉంటే చనిపోతుంది. అలాగే మొదటి నెల గర్భధారణ సమయంలో ఇనుము అధికంగా ఉండే ఆహారాలు తినాలి. అంటే ఎక్కువగా డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు, బంగాళాదుంపలు, బ్రోకలీ, దుంపలు మరియు మొలకలలో ఇనుము సమృద్ధిగా దొరుకుతుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలు పెరగడానికి అలాగే ఆరోగ్యకరమైన శిశువు పెరుగుదలకు ఉపయోగపడుతుంది.
గర్భిణీ స్త్రీలు తరచుగా మలబద్ధకం,విరేచనాలు లేదా హేమోరాయిడ్స్‌తో బాధపడవల్సివుంటుంది. అందుకని ఫైబర్ పరిమాణం అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిది. తినే ఆహార పదార్దాలలో పీచుపదార్థం ఉంటే గర్భిణీ స్త్రీ యొక్క జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మరియు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. మలబద్ధకం మరియు గర్భధారణ సమయంలో అధిక బరువు పెరగకుండా నిరోధించడంలో కూడా సహాయపడతాయి. నారింజ, ఆపిల్, క్యారెట్లు, వోట్స్, కాయధాన్యాలు, కొబ్బరికాయలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. శిశువు పెరుగుదలకు ప్రోటీన్ చాలా ముఖ్యమైనది. ఇది చర్మం, కండరాలు, జుట్టు, ఎముకలను ఏర్పరచడానికి ఉపయోగపడతాయి.
గుడ్లు, మాంసం,చేపలు,కాయధాన్యాలు,సోయాబీన్స్, గింజలు (నట్స్), ధాన్యాలు అన్నింటిలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల గర్భధారణ ప్రారంభ సమయం నుండే ప్రోటీన్ ఎక్కువుగా ఉన్న ఆహారం పై గర్భిణీ స్త్రీ అదనపు శ్రద్ధ పెట్టాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి