ఇప్పుడు అసలే వర్షాకాలం.. వర్షాలు కూడా బాగా పడుతున్నాయి. అయితే చాలామందికి వర్షంలో తడవటమంటే భలే ఇష్టం.ఒక్కసారిగా వాతావరణం అంతా చల్లగా మారిపోతుంది. అయితే ఎండాకాలంలో వేడిని భరించలేక చల్లదనాన్ని కోరుకోవడం మనిషికి అత్యంత సహజం..అయితే ఈ వర్షాకాలంలో కూడా కొన్ని అనుకోని చిక్కులు వచ్చే ప్రమాదం ఉంది.ఎలా అనుకుంటున్నారా.. !!ఈ వర్షాకాలంలోనే అనేక చర్మ సమస్యలు రెడీగా ఉంటాయి..కామన్‌గా ఎండాకాలంలో చెమట ఎక్కువ పోస్తుంది కాబట్టి స్కిన్‌ని చాలా జాగ్రత్తగా మెయింటెన్ చేసి..వర్షాకాలంలో కాస్త బద్దకిస్తు ఉంటాము .కానీ ఎండాకాలంతో పోలీస్తే వానల్లోనే చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి..ఈ కాలంలో ఆడవాళ్ళ చర్మం ఎక్కువగా పొడిబారడం,మొటిమలు రావడం, ఇతర చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువగా బాధించే అవకాశముంది..కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకుంటే..వర్షాకాలాన్ని మీరు అనుకున్న విధంగా ఎంజాయ్ చేస్తూనే మీ అందాన్ని కూడా  కాపాడుకోవచ్చు. అందాన్ని కాపాడుకోవడానికి పెద్దగా ఖర్చు పెట్టాలిసిన పని లేదు, అలాగే  బ్యూటీ పార్లర్స్ చుట్టూ తిరగవలిసిన పని లేదు. ఎంచక్కా మన వంటింట్లో, పెరట్లో దొరికే వస్తువులతోనే మెరిసిపోవచ్చు.అదెలానో తెలుసుకుందాం.. !!



తేయాకు నూనె, కొబ్బరి నూనెల మిశ్రమం చర్మానికి ఎంతో మేలు చేస్తుంది..చిన్న చిన్న పగుళ్లు, దద్దుర్లు, మొటిమల వంటి సమస్యలను దూరం చేయడంలో ఇవి మంచి ఔషదంలా పనిచేస్తాయి.ఈ రెండిటి నూనెల మిశ్రమాన్ని ఒక చిన్న గిన్నెలో కలిపి స్నానం చేసే ముందు ముఖానికి, చేతులకు, కళ్ళకి రాసుకుని మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.అలాగే వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలకు అద్భుతమైన విరుగుడు కలబంద. చర్మంలోని రక్తకణాలను శుభ్రం చేసే శక్తి కలబందకు ఉంది. అందువల్ల బయటకు వెళ్లినప్పుడు కలబంద జెల్‌ను రాసుకోవడం అన్ని విధాల మంచిది.అలాగే తేనే, ఆలివ్ ఆయిల్, నిమ్మరసాలను కలిపి ముఖానికి మాస్క్‌లా పెట్టుకుంటే పొడి చర్మంతో బాధపడే వారికి మంచి ఫలితం కనిపిస్తుంది.




పుచ్చకాయ రసంలో మిల్క్‌పౌడర్‌ను కలుపుకుని రాసుకుంటే చర్మం మీదున్న మచ్చలు వదిలిపోతాయి.వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల మనలో చాలా మంది నీళ్లు సరిగా తాగరు. కానీ ఈ కాలంలోనూ ఎంత ఎక్కువ నీళ్లు తాగితే అంత మంచిది. దీని వల్ల చర్మం ఫ్రెష్‌గా, అందంగా కనిపిస్తుంది.అలాగే బయటకు వెళ్ళినప్పుడు వర్షంలో తడిచి వస్తే వెంటనే మనం టవల్ తో తల తుడుస్తూ ఉంటాము కదా.. అయితే తల తుడుచుకోవడం మంచిదే.. కానీ తల తుడుచుకున్న తర్వాత తల స్నానము చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఒకవేళ మీరు మీ జుట్టుకు నూనె కనుక రాసుకుని ఉంటే, మీ జుట్టు తడవడం వల్ల వాసన వస్తుంది. అందుకనే షాంపూతో తల స్నానము చేసి జుట్టు ని డ్రైయర్ తో కాకుండా సహజంగా ఆరనివ్వండి.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: