చాలామంది ఆడవాళ్లు ఎదుర్కునే ప్రధాన సమస్యల్లో పేలు ఒకటి. ఆడవాళ్ళ జుట్టు పొడవుగా ఉండడం వల్ల తలలో పేలు నివాసాన్ని ఏర్పరుచుకుని భలే ఇబ్బంది పెడతాయి. పేలు ఉండడం వల్ల తల అంతా ఒకటే దురద పుడుతుంది. అంతేకాకుండా ఈ పేలు పిల్లల్ని కూడా పెడతాయి. వాటినే ఈపులు అంటాము.. అవి జుట్టుని అంటిపెట్టుకుని బయటకు కనిపిస్తూ ఉంటాయి. ఫలితంగా మనం ఎక్కడికన్నా వెళ్లాలన్న మొహమాట పడతాము. అలాగే వీటివల్ల దురద వస్తుంది. మనం గోకటం వలన నెత్తిమీద చర్మంనకు చికాకుతో పాటు ఎక్కువగా బాధ కలుగుతుంది. తలలో పేల కోసం కఠినమైన రసాయనాలు కాకుండా సమర్ధవంతమైన ఇంటి చికిత్సలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం
.!!



వెల్లుల్లి లో ఉండే వాసన వలన పేను త్వరగా చనిపోతుంది. అందుకే వెల్లుల్లిని పేలు చికిత్స కోసం ఉపయోగించవచ్చు. వెల్లుల్లిని మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ చేయండి. దానికి నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించండి. ఒక అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టును శుభ్రం చేయండి. ఆ తర్వాత దువ్వెనతో దువ్వితే పేలు వచ్చేస్తాయి. అలాగే ఆపిల్ సైడర్ వెనిగర్,  కొబ్బరి నూనె రెండిటిని సమపాళ్లలో కలపాలి. రాత్రి పడుకోనే సమయంలో ఈ మిశ్రమాన్ని పట్టించి అలా వదిలేయాలి. మరుసటి రోజు ఉదయం షాంపూ తో కడగడంగాని లేదా దువ్వెనతో గాని దువ్వాలి.



అలాగే రాత్రి పడుకోవటానికి ముందు కొంచెం వైట్ వెనిగర్ తీసుకోని తలకు పట్టించి షవర్ క్యాప్ లేదా టవల్ తో మీ తలను కవర్ చేయాలి. రాత్రి అలా వదిలేసి ఉదయం షాంపూ తో మీ జుట్టును కడిగి, దువ్వెనతో దువ్వితే పేలు బయటకు వస్తాయి.పేను చికిత్సకు, మూడు వారాల పాటు ప్రతి ఉదయం,  సాయంత్రం మీ జుట్టుకు ఆలివ్ నూనె లేదా బాదం నూనె రాసి దువ్వండి. ముళ్ళు మాదిరిగా ఉన్న ఒక దువ్వెనను ఎంచుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: