మహిళలకు ఎల్లప్పుడూ తోడుగా.. అన్న , నాన్న తోడు అవసరం లేకుండా ఎక్కడికైనా హ్యాపీగా వెళ్లి వచ్చేలా మహిళలకు సహాయంగా ఉండే స్కూటీలో ఇప్పటికే ఎన్నో రకాల కొత్త కొత్త మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే యాక్టివా 5జి అందుబాటులోకి వచ్చి సూపర్ హిట్ అవ్వగా ఈ నెల 15న యాక్టివా 6జి కూడా భారత్ కి రానుంది. 

 

జపాన్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ అయిన హోండా సరికొత్త యాక్టివా 6 జి ని ఈ నెల 15వ తేదీన ప్రారంభించబోతోంది. దానికి సంబంధించి ఇప్పటికే టీజర్ వీడియోను విడుదల చేసింది. సరికొత్తగా వస్తున్న ఈ యాక్టివా 6జి స్కూటర్‌లో బిఎస్ 6 కంప్లైంట్ ఇంజన్ ఉంటుంది. 

 

ఇప్పటికే భారత మార్కెట్లో హోండా యాక్టివా అత్యధికంగా అమ్ముడవుతున్న ఆటోమేటిక్ స్కూటర్. ఎందుకంటే వినియోగదారునికి.. ముఖ్యంగా మహిళకు కావలసిన అన్ని ఫీచర్స్ ఇందులో ఉండటం వల్ల ఇది ఇప్పుడు ఎక్కువగా అమ్ముడవుతుంది. హోండా 6జి కూడా ప్రతినెలా అమ్మకాలు బాగా జరుగుతున్నాయని, ప్రతి నెలా అమ్మకాలలో సుమారు 2.5 లక్షల యూనిట్లు నమోదు చేస్తామని కంపెనీ ప్రకటించింది. 

 

త్వరలో విడుదల కానున్న హోండా యాక్టివా 6జి లో ఫీచర్లు భారీగా ఉంటాయని యూజర్లు భావిస్తున్నారు. హొండాలో సాధారణ ఫీచర్స్ తో పాటు కొన్ని ప్రత్యేకమైన ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ బైక్ ఈ నెల 15వ తేదీన విడుదల కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: