బైక్ ప్రియులకు భారీ షాక్.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్క వస్తువు పై ధరలు భారీగా ధరలు పెరిగాయి. ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యం లో  నిత్యావసర వస్తువుల ధరల కు రెక్కలు వచ్చాయి. అదే విధంగా వస్తువుల పై కూడా ధరలు పూర్తిగా పైకి కదిలాయి. మరోవైపు వాహన తయారీ సంస్థలు కూడా ధరలను పెంచారు. ఇప్పటికే పలు రకాల సంస్థలు వాహనాలను అందిస్తున్నారు. ఇప్పుడు ఆ దారి లోకి మరొక ప్రముఖ కంపెనీ వచ్చి చేరింది..


తాజాగా మరొక బైక్ సంస్థ కూడా ధరలను పెంచారు. ఆ కంపెనీకి మంచి డిమాండ్ కూడా మార్కెట్లో ఉంది. కరోనా వల్ల బైక్ తయారీ సరుకులకు కొరత ఏర్పడటం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విషయానికొస్తే.. బజాజ్ ‌కు చెందిన ప్రీమియం బైకుల విక్రయ సంస్థ కేటీఎం తన వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. తయారీ ఖర్చులు పెరుగడం తో ధరలను పెంచాల్సి వచ్చిందని సంస్థ ఒక ప్రకటన లో వెల్లడించింది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయం తో కేటీఎం, హుస్కావర్ణ బైకులు రూ.10 వేల వరకు ప్రియం కానున్నాయి.


వివిధ మోడళ్ళను బట్టి ధరల పెరుగుదల లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. దీంట్లో కేటీఎం బైకులు రూ.8,812 వరకు అధికమవనుండగా, హుస్కవర్ణ బైకులు రూ.9,730 వరకు పెరిగాయి. కేటీఎం బైకులు రూ.1,60,319 నుంచి రూ.1,83,328 ధరల శ్రేణిలో లభించనున్నాయి... ధరలు పెరిగినా కూడా ఈ బైక్ లకు డిమాండ్ మాత్రం మాములు గా లేదని చెప్పాలి. సేల్స్ కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ కంపెనీ అడుగుల్లో హీరో, టీవీఎస్ మోటార్ సైకిల్ కూడా అదే విధంగా ఉన్నాయి. మరి ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకాస్త ధరలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: