భారత దేశ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మధ్య తరగతి ప్రజలకు చీప్ అండ్ బెస్ట్ కార్లను మంచి క్వాలిటితో ఎల్లప్పుడూ అందిస్తుంది. ఇక ప్రభుత్వంతో ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లకు ఒప్పందం కుదుర్చుకుంది టాటా మోటార్స్ సంస్థ.ఈ మోటార్స్ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఇఇఎస్ఎల్) పూర్తి యాజమాన్యంలో ఉన్న కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సిఇఎస్ఎల్) నుండి 300 ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఓ ఒప్పందాన్ని దక్కించుకుంది.గవర్నమెంట్ తో కుదుర్చుకున్న  ఒప్పందం ప్రకారం, సిఇఎస్ఎల్ సంస్థకు టాటా మోటార్స్ 300 ఎలక్ట్రిక్ వాహనాల అందజేయనుంది.ఇక దీనికి మొత్తం ఖర్చు రూ.44 కోట్లు. ఈ టెండర్ రెండు షెడ్యూల్లో వర్తిస్తుంది. ఇందులో మొదటి షెడ్యూల్ ప్రకారం 300 ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయబడతాయి.


ఆ తర్వాత రెండవ షెడ్యూల్‌లో రవాణా, లోడింగ్, అన్‌లోడ్,వంటి వాటికి ప్రదేశానికి బదిలీ, రవాణా భీమా ఇంకా వాహనాల పంపిణీకి సంబంధించిన ఇతర ఖర్చులు ఉంటాయి.ఈ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వ ప్రయోజనాల కోసం ఉపయోగించనున్నారు. ఈ ప్రయోజనం కోసం టాటా మోటార్స్ తమ నెక్సాన్ ఈవి కార్లను ఉపయోగించబోతున్నట్లు సమాచారం అందుతుంది.సిఇఎస్ఎల్ టాటా నెక్సాన్ ఈవి గురించి మాట్లాడుతూ , టాటా మోటార్స్ అందిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు (కార్లు) మూడేళ్ల వారంటీతో వస్తాయని మరియు ప్రతి ఛార్జ్‌పై 250 కి.మీ లేదా అంతకంటే ఎక్కువ రేంజ్‌ను కలిగి ఉంటుందని తెలపడం జరిగింది.



ఈ నేపథ్యంలో టాటా మోటార్స్‌ను ఉద్దేశించి సిఇఎస్ఎల్ ఎమ్‌డి మహువా ఆచార్య ఈ విధంగా మాట్లాడటం జరిగింది.భవిష్యతు ఎలక్ట్రిక్ వాహనాలదే. భారతదేశంలో ఎక్కువ ప్రభుత్వ సంస్థలు విద్యుత్ రవాణాకు మారడం చాలా సంతోషంగా ఉంది. టాటా మోటార్స్‌తో మా అనుబంధం భారతదేశంలో భవిష్యత్ చైతన్యాన్ని పెంచుతుందని మహువా ఆచార్య చెప్పడం జరిగింది.ఇక ఈ  ఒప్పందం చాలా కాలం వరకు టాటా మోటార్స్‌కు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో టాటా నెక్సాన్ ఈవి ఇప్పటికే, ఒక బలమైన మోడల్‌గా ఉండి, దాని అందుబాటు ధర, సుధీర్ఘమైన రేంజ్  విశిష్టమైన ఫీచర్ల వలన మంచి ప్రజాదరణను సొంతం చేసుకుంది.ప్రస్తుతం మార్కెట్లో టాటా నెక్సాన్ బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ.13.99 లక్షలుగా ఉంది. కాగా, టాటా నెక్సాన్ ఎక్స్‌జెడ్ ప్లస్ మరియు ఎక్స్‌జెడ్ ప్లస్ లగ్జరీ వేరియంట్ల ధరలను కంపెనీ రూ.16,000 పెరిగి రూ.15.66 లక్షలకు చేరుకుంది. అలాగే, టాటా నెక్సాన్ ఈవీ ఎక్స్‌జెడ్ ప్లస్ లగ్జరీ వేరియంట్ ధర కూడా రూ.16,000 పెరిగి రూ.16.56 లక్షలకు పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: