తెలంగాణ‌లో క‌రోనా మూడోద‌శ రాద‌నుకుంటున్నాన‌ని ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. బుధ‌వారం ఆమె మెట్రాజ్‌ప‌ల్లి పంప్‌హాస్ ప‌నుల‌ను పార్టీ నేత‌లు, అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. అత్యుత్త‌మ సాంకేతిక ప‌రిజ్ఞానంతో ప్యాకేజ్‌-21 నిర్మాణ‌మ‌వుతోంద‌ని, దీనిద్వారా రెండు ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు అందుతుంద‌న్నారు. రైతుల భూముల‌కు న‌ష్టం వాటిల్ల‌కుండా పైపులైన్ల‌న్నీ భూగ‌ర్భంద్వారా వెళ్ల‌డ‌మే దీని ప్ర‌త్యేక‌త అన్నారు. నిజామాబాద్‌లో క‌రోనా మూడోద‌శ‌ను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంద‌ని, అయినా మూడోద‌శ రాద‌న‌కుంటున్నాన‌న్నారు. అయిన‌ప్ప‌టికీ ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా అన్ని వైద్య‌స‌దుపాయాల‌ను సిద్ధంగా ఉంచిన‌ట్లు క‌విత వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: