పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా ఓజి అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. సుజత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ప్రకాష్ రాజ్ , శ్రేయ రెడ్డి , అర్జున్ దాస్ ఈ మూవీ లో ముఖ్యమైన పాత్రలలో నటించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో నిర్మాతగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి డి వి వి దానయ్య ఈ సినిమాను నిర్మించాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై విడుదలకు ముందు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానితో ఈ సినిమాకు పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన తొమ్మిది రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ తొమ్మిది రోజుల్లో ఈ సినిమాకు ఎన్ని కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్లను సాధిస్తే హిట్ స్టేటస్ను అందుకుంటుంది అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ ప్రపంచ వ్యాప్తంగా 174 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇప్పటివరకు ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 121.30 కోట్ల షేర్ ... 180.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిది రోజుల్లో 166.58 కోట్ల షేర్ ... 274.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. దానితో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకోవాలి అంటే మరో 7.42 కోట్ల షేర్ కలెక్షన్లను సాధించాల్సి ఉంది. మరి ఈ సినిమా టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: