కేంద్ర హోంమంత్రి అమిత్  షా ని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు నేడు కలిసారు. అనంతరం మాట్లాడిన ఆయన... భైంసా అల్లర్ల పై అమిత్ షా కి ఫిర్యాదు చేశాను అని వెల్లడించారు. భైంసాలో హిందువుల మీద దాడికి పాల్పడుతున్నారు అని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా హిందువుల పై కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు అని అన్నారు. మార్చిలో జరిగిన అల్లర్లలో 30 మంది హిందువుల పై రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని అన్నారు.

అందులో మైనర్లు  ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం చిత్రహింసలకు పాల్పడుతున్నదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. మైనారిటీలను పోలీసులు ఏమి అనట్లేదు కేవలం హిందువుల పైన మాత్రమే కేసులు పెడుతున్నారు అని ఆరోపించారు. అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి భయపడి హిందువుల పైన కేసులు పెడుతున్నారు అని ఆయన ఆరోపించారు. హిందువుల పైన పిడియాక్ట్ పెట్టారన్నారు. సిబిసిఐడి తో ఎంక్వయిరీ చేయించాలని అమిత్ షానీ కోరడం జరిగిందని చర్యలు తీసుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp