పోలీసుల అదుపులో ఉన్న ఘన శ్యామ్ దాస్ జెమ్స్ అండ్ జ్యూవెలర్స్ అధినేత సంజయ్ అగ్రవాల్ ను పోలీసులు అరెస్టు చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు మేరకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంజయ్ ను అరెస్టు చేసినట్లు ప్రకటించింది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం 2010-11లో ఘన శ్యామ్ దాస్ జెమ్స్ అండ్ జ్యూవెలర్స్ అధినేత సంజయ్ అగ్రవాల్ నకలీ ఫోర్జరీ పత్రాలు సృష్టించి, హైదరాబాద్ నగరం అబిడ్స్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి దాదాపు 67 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. ఆ డబ్బులతో అక్రమంగా బంగారం కొనుగోలు చేసి, తన జ్యూవెలర్స్ ద్వారా సదరు బంగారాన్ని విక్రయించారు. అలా ఆర్జీంచిన అక్రమ సొమ్ముతో కుటుబ సభ్యులపేరుతో డొల్ల కంపెనీలను ఆరంభించారు. ఎటుంటి సుంకం చెల్లించకుండా బంగారాన్ని దిగుమతి చేసుకోవడం, ఆ పై విక్రయించడం వంటి అభియోగాల పై సంజయ్ ఇప్పటికే కోల్ కతా కేంద్రం లోని ఈఢీ అధికారులు ఇతనిని విచారణ చేశారు. తాజాగా ఎస్.బి.ఐ ఫిర్యాదు మేరకు సంజయ్ అగ్రవాల్ ను హైదరాబాద్ కు తీసుకు వచ్చి నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. ఆ కోర్టు ఇతనికి రిమాండ్ విధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ed