
ఏం చేస్తున్నారు.. ?
బాలయ్య.. అసెంబ్లీలో మాట్లాడుతూ.. 2022-23 మధ్య సినీ రంగానికి సంబంధించిన సమస్యలపై అప్పటి సీఎం జగన్‌తో చర్చించేందుకు వచ్చిన ఇండస్ట్రీ పెద్దలపై కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే చిరంజీవిని.. ఆయన వాడు-వీడు అని సంబోధించారు. ఇది అందరికీ తెలిసిందే. దీనిని హైలెట్ చేస్తూ.. చిరంజీవిని అవమానించారంటూ.. వైసీపీ మెగా పాలిటిక్స్‌కు తెరదీసింది. అంతేకాదు.. మెగా అభిమానులను కూడా అంతర్గతంగా రెచ్చగొట్టే ప్రక్రియ కు దారితీసింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మెగాస్టార్‌కు అనుకూలంగా వైసీపీ నాయకులు స్పందిస్తున్నా రు.
అయితే.. ఇది వైసీపీకి కలిసివస్తుందా? అనేది సందేహమే. కానీ, ఇదే సమయంలో చిరంజీవి కూడా స్పందించి.. బాలయ్య.. చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తమకు అవమానం జరగలేదని.. అప్పటి సీఎం జగన్ తమకు ఎంతో గౌరవం ఇచ్చారని చెప్పారు. ఆయనతో కలిసి భోజనం కూడా చేశామన్న ఆయన.. అనేక సమస్యలను చెప్పుకొనే అవకాశం కల్పించారని తెలిపారు. ఇది కూడా వైసీపీకి కలిసి వస్తోంది. అంటే.. ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా.. చిరు చేసిన వ్యాఖ్యలను వైసీపీ తమకు అనుకూలంగా మార్చుకుంటే.. బాలయ్య వ్యాఖ్యలను వ్యతిరేకంగా చూపించే ప్రయత్నం చేస్తోంది.
ఇక, టీడీపీలోనూ చర్చ..!
హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు.. ఇటు టీడీపీలోనూ.. చర్చకు దారితీశాయి. ప్రస్తు తం కూటమి ప్రభుత్వం కూడా ఇండస్ట్రీ సమస్యలపై చర్చించేందుకు పెద్దలను ఆహ్వానించిందిని బాలయ్యే చెప్పారు. అయితే.. ఆ జాబితాలో ఎక్కడో 9వ పేరుగా తన పేరును చేర్చారని తెలిపారు. అంటే.. బాలయ్యకు ముం దు.. 8 మంది ఉన్నారు. దీనిని తప్పుబడుతూ బాలయ్య.. తనను 9వ స్థానంలో చేర్చారంటూ.. మంత్రి దుర్గేష్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇది టీడీపీ నేతలను, బాలయ్య అభిమానులను కూడా ఇబ్బంది పెట్టింది. మరి ఇది ఎటు దారితీస్తుందో చూడాలి.