ఎయిర్‌పోర్ట్ మెట్రో అలైన్ మెంట్‌ను హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి పరిశీలించారు. సీనియర్ ఇంజనీర్లతో కలిసి రాజేంద్రనగర్ కొండపై సుమారు 1.3 కి.మీ పొడవుగల విమానాశ్రయ మెట్రో అలైన్‌మెంట్‌ను ఎండి ఎన్వీఎస్ రెడ్డి పరిశీలించారు. నిటారుగా ఉండే ఎత్తులు, బండరాళ్లు, లోయలు ఉన్న ఈ కొండపై విమానాశ్రయ మెట్రో వయాడక్ట్ నిర్మాణం చాలా కష్టమైన పని అని.. ఎండి ఎన్వీఎస్ రెడ్డి అన్నారు.


మెట్రో అలైన్‌మెంట్ ఓఆర్ఆర్ క్రాష్ బారియర్ మధ్య గ్యాప్ దాదాపు 18 అడుగులు మాత్రమే ఉండి, ఓఆర్ఆ లోతైన కటింగ్ లో ఉన్నందున, ఓఆర్ఆర్ వైపు ఎటువంటి బండరాళ్లు పడకుండా తగిన బలం, ఎత్తుతో కూడిన రక్షణ బ్యారియర్లను అమర్చాలని ఎండి ఎన్వీఎస్ రెడ్డి సూచించారు.  అన్నారు. సంఘ విద్రోహ కార్యకలాపాల నుండి మెట్రో వయాడక్ట్‌ను రక్షించడానికి విమానాశ్రయం మెట్రో కు ఎడమ వైపున రక్షిత ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయాలని ఎండి ఎన్వీఎస్ రెడ్డి సూచించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: