ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ బ్యూటీ ఆర్టికల్ చదవండి... ఇప్పుడు దాకా మనం ఎండాకాలం, వానాకాలం అనుభవించాం. భయంకరమైన వానలతో మనం ఎన్నటికీ మరిచిపోలేని అనుభూతినే పొందాం.ఇప్పుడు చలికాలం లోకి అడుగుపెట్టబోతున్నాం.  చలి కాలం చాలా హాయిగా ఉంటుంది. వాన లేని కాలం, చెమట లేని కాలం చలి కాలం. కార్తీక మాసపు వనభోజనాలూ, ధనుర్మాసపు ముంగిటి ముగ్గులూ అన్నీ ఇప్పుడే. వీటన్నింటినీ ఎంజాయ్ చేయడం తో పాటూ ఒక విషయం లో జాగ్రత్త తీసుకోవాలి. చలి కాలం మనకి చక్కని కాలమే కానీ చర్మానికి మాత్రం కాదు.రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయండి. చలికాలం లో పొద్దు పొద్దున్నే వెచ్చని దుప్పటి లో నుండి బయటకు రావడం కష్టమే, కానీ మీకు మీ స్కిన్ అంటే ప్రేమ ఉంటే మాత్రం ఇది తప్పదు. ఎక్సర్సైజ్ వల్ల హార్ట్ రేట్ పెరుగుతుంది, ఫలితంగా బ్లడ్ సర్క్యులేషన్ బావుంటుంది.

చలికాలం లో వేడి వేడి నీళ్ళతో స్నానం చేస్తే ఉండే మజానే వేరు. కానీ, స్కిన్ కి మాత్రం అంత వేడి నీరు హాని చేస్తుంది. అందుకని గోరు వెచ్చని నీటితోనే స్నానం చేయండి. అలాగే, స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఇందు వల్ల స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది.సమ్మర్ లో స్కిన్ కి సరిపోయే ప్రోడక్ట్స్ వింటర్ లో సరిపడవు. వింటర్ లో స్కిన్ హెల్దీగా గ్లోయీ గా ఉండాలంటే ఒకటే మార్గం, మైల్డ్ ప్రోడక్ట్స్ ని ఎంచుకోవడం. మాయిశ్చరైజర్స్ ఉన్న క్లెన్సర్స్ ని ఎంచుకోండి. ఆల్కహాల్ ఉన్న మాస్క్స్, పీల్స్, ఆస్ట్రిజెంట్ లోషన్స్, ఇంకా ఇతర స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ పూర్తిగా ఎవాయిడ్ చేయండి.


ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్ళినా రెగ్యులర్ గా నీరు తాగడం మాత్రం మర్చిపోకండి. చల కాలం లో గాలిలో తేమ తక్కువగా ఉంటుంది. అందుకని బాడీలో ఉన్న నీరు ఆవిరైపోతుంది. ఇంట్లో హ్యుమిడిఫయర్ ని ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా కొంత వరకూ ఈ సమస్యని అధిగమించవచ్చు.ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీరు మీ స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. సన్ స్క్రీన్ మర్చిపోకండి. గ్లోవ్స్, క్యాప్స్ యూజ్ చేయండి. వెచ్చని సూర్య కిరణాలు బావుంటాయి కానీ వాటిలో ఉన్న యూవీ రేస్ స్కిన్ కి హాని చేస్తాయి. అందుకే ఈ జాగ్రత్తలు అవసరం.ఇలాంటి మరెన్నో బ్యూటీ ఆర్టికల్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...


మరింత సమాచారం తెలుసుకోండి: