కంగనా విషయంలో శివసేన వెనుకడుగు వేయడానికి కారణం ఆమె ఒక మహిళ కావడంతో పాటు శివసేన మహారాష్ట్రంలో అధికారంలో ఉండడం కూడా అని తెలుస్తుంది... ప్రతిపక్షంలో ఉంటే ఏమైనా చేయవచ్చు…కానీ అధికారంలో ఉంటే మాత్రం కాస్తయిన బాధ్యత ఉండాలి. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన పార్టీ ఇలా చేసి అభాసుపాలయ్యేకంటే సైలెంట్ గా ఉండాలని వారు భావిస్తున్నారట..తర్వాత సీఎం కుమారుడ్ని టార్గెట్ చేసిన కంగనాకు క్షమించకుండా ఆమెకు షాక్ ఇవ్వడానికి ముంబైలోని ఆమె ఆఫీసును.. అక్రమ నిర్మాణం అని కూల్చేశారు బీఎంసీ అధికారులు.