కింజారపు ఫ్యామిలీ తమ ప్రాంతం కోసం కాకుండా చంద్రబాబు మెప్పు కోసం అమరావతి పై పోరాటం చేయడం ఇప్పుడు ఆ ప్రాంత వాసులకు నచ్చడం లేదట.. విశాఖ కార్యనిర్వాహక రాజధాని అయితే.. ఉత్తరాంధ్ర ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు విరివిగా లభిస్తాయనడంలో సందేహంలేదు. నెట్వర్క్ కంపెనీల కేబుల్ కోసం గోతులు తీసేందుకు, సిమెంట్ పనులకు శ్రీకాకుళం జిల్లా ప్రజలు హైదరాబాద్, చెన్నై సహా ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు.