దేశమంతా కరోనాతో బెంబేలెత్తిపోతుంటే ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఆ మద్య విశాఖలో గ్యాస్ లీక్... అంఫన్ తుఫాన్ తో పశ్చిమ బెంగాల్ అతలాకుతలం.. రాజస్థాన్, మహారాష్టలో మిడతల గోల ఇలా ఒక్కటి కాదు రెండు కాదు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వీటికి తోడు తాజాగా ఓ అలుగు చేసిన హడావుడి షాక్ తిన్నారు.. అదికూడా క్వారంటైన్ చేసిన పేషెంట్స్ వద్ద అలుగు కనిపించడంతో అక్కడి వారంతా కంగారు పడిపోాయారు. అలుగు అని, పొలుసుపంది అని పిలుచుకునే పాంగోలిన్ ఒడిశా క్వారంటైన్ సెంటర్లో ప్రత్యక్షమైంది. కటక్ జిల్లాలోని అతర్‌గఢ్‌లో ఏర్పాటు చేసిన సెంటర్‌లో అది తిరుగుతూ కనిపించడంతో జనం బెంబేలెత్తిపోయారు. అసలే కరోనా, ఆపై పొలుసుపంది అని హడలిపోయారు.  

 

ఒడిశాలో 1,438 కరోనా కేసులు ఏడు మరణాలు నమోదయ్యాయి. చైనాలో పొలుసుపందులలు,  గబ్బిలాల నుంచే కరోనా వ్యాపించినట్లు వార్తలు రావడం తెలిసిందే.  అటవీశాఖ అధికారులు దాన్ని కాపాడి సెంటర్లలోకి తీసుకెళ్లారు. దానికి కూడా కరోనా పరీక్ష నిర్వహిస్తామని, నెగిటివ్ అని తేలిన తర్వాతే అడవిలోకి వదలేస్తామని చెప్పారు.కరోనా రావడానికి తానే కారణమని జనం అనుకోవడం దానికి కూడా తెలిసినట్టుంది.  అందుకే తాను గుర్తుఉన్నానా లేదా అని పరీక్షించుకోవడాని ఇది వచ్చిందా ఏంటీ అని పేషెంట్స్ గుస గుసలాడుకుంటున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: