మహారాష్ట్రలో కరోనా కేసులు ఏ మాత్రం ఆగడం లేదు. కరోనా కట్టడికి అక్కడ చర్యలు తీసుకున్నా సరే పెద్దగా ఫలితం  ఉండటం లేదు. ప్రతీ రోజు కూడా వేల కేసులు మహారాష్ట్రలో నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. అక్కడ మరణాలు కూడా వేగంగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబై లో 50 వేలు కేసులు నమోదు అయ్యాయి. 

 

కొత్తగా ముంబై 1,311 మంది రోగులతో 50,000 దాటింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) లోని ప్రైవేట్ కార్యాలయాలకు 10% ఉద్యోగులు లేదా 10 మంది ఉద్యోగులు (ఏది ఎక్కువైతే అది ) పనిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) బస్సు సర్వీసులను తిరిగి ప్రారంభించడంతో పాటు, రోడ్లపై ఎక్కువ ట్రాఫిక్ స్నార్ల్స్ కనిపించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: