నేడు నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన ఆప్తుడు అయిన బాలయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. . ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, "60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి  షష్టి పూర్తి శుభాకాంక్షలు.   ఇదే ఉత్సాహంతో ,ఉత్తేజంతో ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని,అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను.

 

ప్రియమైన బాలకృష్ణా... నువ్వు అరవైల్లోకి అడుగుపెట్టావు. నీ అద్భుతమైన ప్రయాణాన్ని నేను ఎంతో ప్రేమగా గుర్తుచేసుకుంటున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు" అని పేర్కొన్నారు.  ఇదిలా ఉంటే ఈ మద్య తెలుగు రాష్ట్రాల సీఎం లను కలిసిన సినీ పెద్దలు బాలయ్యకు ఇలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన ఓ కౌంటర్ కూడా వేశారు.. అది సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అయ్యింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: