రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తుంది.వ‌చ్చే నెల మొద‌టి వారంలో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ తెలిపారు.వీటితో పాటు జులై చివ‌రి వారంలో ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు కూడా నిర్వ‌హించే అవ‌కాశం ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు.ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో చ‌ర్చించి ప‌రీక్ష‌ల ఏర్పాట్ల‌పై తుది నిర్ణ‌యం తీసుకుంటామ‌ని మంత్రి తెలిపారు.ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌కు 10 ల‌క్ష‌ల‌మందికిపైగా హాజ‌ర‌వుతార‌ని...ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు 15 రోజుల ముందే షెడ్యూల్ ప్ర‌క‌టించేలా చ‌ర్య‌లు తీసుకోనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: