ఏపీలో జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నుంచి పోలింగ్, కౌంటింగ్ వరకూ అంతా ఏక‌ప‌క్షంగా న‌డించింద‌ని, అధికార పార్టీకి అనుకూలంగా అధికారులు వ్య‌వ‌హ‌రించార‌ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. గురువారం విజ‌య‌వాడ‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు అధికారపార్టీకి అనుకూలంగా రావ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం వైసీపీ దౌర్జన్యాలు, బెదిరింపులు, ప్రలోభాలతోనే సాగిందని ప్ర‌జ‌లంద‌రికీ తెలుస‌న్నారు. పోలింగ్‌కు క‌నీసం నాలుగువారాల ముందు ఎన్నికల కోడ్ అమల్లో ఉండాల‌న్న సుప్రీంకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్ర‌భుత్వం ఖాతరు చేయలేదని విమ‌ర్శించారు. ఈ ఎన్నికలను రద్దు చేయాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేస్తూ తీర్పిచ్చింద‌ని, ఇలాంటి తీర్పులతో ప్రజాస్వామ్యం ఎలా మనగలుగుతుందని రామకృష్ణ ప్ర‌శ్నించారు. ప్ర‌జాస్వామ్యాన్ని నిల‌బెట్టాలంటే ప్ర‌జాస్వామ్య బ‌ద్ధంగా ప‌రిపాల‌న సాగించాల్సి ఉంటుంద‌ని, దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఆ విష‌యాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రిచిపోయింద‌న్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: