ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో  పీఆర్సీ ఫైట్ రోజు రోజుకు ఒక మ‌లుపు తిరుగుతున్న‌ది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో తమ కార్యాచ‌ర‌ణపై ఓ క్లారిటీ  ఇచ్చామ‌ని  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు.  ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాలు పీఆర్సీ, ఇతర డిమాండ్‌లను నెరవేర్చుకోవడం కోసం ఉద్యమ బాట పట్టాలని నిర్ణ‌యించుకున్నారు.

ఇప్ప‌టికే త‌మ  సమస్యలపై ఉద్యోగ సంఘాల నేత‌లు కరపత్రాలు కూడా  ఆవిష్కరించి భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ‌ను కూడా ప్ర‌క‌టించారు. అయితే ఇటీవ‌లే తిరుప‌తిలో వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన‌ప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం వైఎస్ జ‌గ‌న్ డిసెంబ‌ర్ 10 పీఆర్‌సీ అమ‌లు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.  ఈ త‌రుణంలో ఇవాళ సీఎం స‌మీక్ష నిర్వ‌హించ‌డంతో.. ఈ స‌మీక్ష‌లో సీఎం ఏమి ప్ర‌క‌టిస్తార‌నేది అటు ఉద్యోగ సంఘాల నేత‌లు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా  సీపీఎస్ రద్దు చేయడంతో పాటు పీఆర్సీని వెంటనే ప్రకటించాలని,  కాంట్రాక్ట్ కార్మికులందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలని  ఉద్యోగ సంఘాల నేతలు కోరారు.  సీఎం స‌మీక్ష‌లో ఏ విధంగా స్పందిస్తారో కొద్దిసేపు వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: