వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ అధినేత, సీఎం జగన్ ఇప్పటి నుంచే ప్రణాళికలు ప్రారంభించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీ.. 175కు ఏకంగా 151 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో అదే ఓ పెద్ద సంచలనం.. అయితే.. ఈసారి ఏకంగా 175కు 175 సీట్లు రావాలని జగన్ కలలు కంటున్నారు.


వచ్చే ఎన్నికల్లో 175 కి 175 సీట్లు సాధించాలని.. అదే మన లక్ష్యమని  జగన్ పార్టీ ఎమ్మెల్యేలు,  నేతలకు టార్గెట్‌ విధించారు. రాష్ట్రంలోని 87శాతం కుటుంబాలకు పథకాలు చేరాయంటున్న  సీఎం.. వచ్చే ఎన్నికల్లో   175 కి 175 సీట్లు సాధించగలుగుతామని అంటున్నారు. ఇదేమీ కష్టం కాదని.. ఇది జరగాలి అంటే మనం కష్టపడాలని అంటున్నారు. మరి 175కు 175 అనే టార్గెట్‌ అసలు సాధించగలిగిందేనా.. లేక పార్టీ క్యాడర్‌లో జోష్ నింపేందుకు, ధైర్యం కోసం జగన్ అలా చెప్పారా అన్న చర్చ ఇప్పుడు పార్టీలో జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: