ఈ దేశ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎన్డీఏ ఎంపిక చేసింది. ఈ పదవి అందుకోబోతున్న తొలి ఎస్టీ ఆమె కావడం విశేషం. అంతే కాదు.. ఇప్పటివరకూ ఈ పదవి దక్కిన వారిలో అందరికంటే ద్రౌపది ముర్ము చిన్నవారు కావడం విశేషం. అయితే.. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆమెను నిన్న రాత్రి పది గంటల సమయంలో ప్రకటించారు.

తనను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు తెలిసి ద్రౌపది ముర్ము ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఆదివాసీ మహిళనైన తనను ఈ సర్వోన్నత పదవికి అభ్యర్థినిగా ఎంపిక చేయడం భాజపా నాయకత్వానికే చెల్లిందంటూ ఆమె ఆనందం వ్యక్తం చేశారు. సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌ నినాదంతో ముందుకెళ్తున్న ప్రధాని మోదీకి కృతజ్ఞతలు అంటూ ఆమె స్పందించారు. తాను అన్ని పార్టీల నేతలను కలసి రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరుతానని ద్రౌపది ముర్ము అన్నారు. ఇప్పటికే గవర్నర్‌గా విధులు నిర్వహించిన తనకు రాష్ట్రపతి వంటి అత్యున్నత రాజ్యాంగ పదవి నిర్వహించడం ఇబ్బంది కాదని ఆమె తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: