ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. ఐదు ప్రాణాలు అక్కడికక్కడే గాలిలో కలసిపోయాయి. ప్రకాశం జిల్లా కంభం దగ్గరలో ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ లారీని ఓ కారు వెనక నుంచి బలంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు  అక్కడికక్కడే మరణించారు. మాచర్ల నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు సమాచారం వస్తోంది.


ఈ ప్రమాదంలో మరణించిన వారిని పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ కారు ప్రమాదంలో చనిపోయిన వారిలో అనిమిరెడ్డి (60), గురవమ్మ (60), అనంతమ్మ (55),ఆదిలక్ష్మి (58), నాగిరెడ్డి (24) ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రమాదం గురించిన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు. అయితే ఒక్కరు కూడా కారులో ప్రాణాలతో మిగల్లేదు. అనిమిరెడ్డి (60), గురవమ్మ (60), అనంతమ్మ (55),ఆదిలక్ష్మి (58), నాగిరెడ్డి (24) మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: