తెలంగాణలో కొన్నాళ్ల క్రితం సంచలనం సృష్టించిన క్యాసినో కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. తాజాగా  చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పుడు మంత్రి తలసాని సోదరులను ఈడీ విచారిస్తుండటం సంచలనం సృష్టిస్తోంది. తలసాని సోదరులు తలసాని మహేష్, తలసాని ధర్మేందర్ యాదవ్ ను ఈడీ విచారిస్తోంది. చీకోటి తో ఉన్న సంబంధాలపై ఈడీ ఆరా తీస్తోంది.

అలాగే హవాలా, క్యాసినో కేసులోనూ ఈడీ విచారణ ముమ్మరం చేసింది. చీకోటి ప్రవీణ్ తో కలిసి  తలసాని మహేష్, తలసాని ధర్మేందర్ యాదవ్ విదేశాలకు వెళ్లినట్లు ఈడీ అనుమానిస్తోంది. చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు ధర్మేంద్ర యాదవ్ మహేష్ యాదవ్ లను సుదీర్ఘంగా విచారించింది.  దాదాపు 9 గంటలకు పైగా ఈడీ విచారణ కొనసాగినట్టు తెలుస్తోంది.  ఫేమా నిబంధనల ఉల్లంఘన, మనీలాండరింగ్ అంశాలపై తలసాని సోదరులను ఈడీ అధికారులు విచారించినట్టు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: