కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్యారంటీల అమలుపై దృష్టి సారించింది. రేపటి నుంచే రాష్ట్ర మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అమల్లోకి తీసుకురాబోతున్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని రేపు సీఎస్ శాంతి కుమారి ప్రారంభిస్తారు. ఈ విషయాన్ని నిన్న కేబినెట్ మీటింగ్ తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్‌ వివరించారు. గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల విషయమై కేబినెట్‌లో చర్చించామని.. అధికారుల నుంచి పూర్తి వివరాలు అందాక నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

 
రెండు ప్రధాన గ్యారంటీలు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని మరో మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. రెండు ప్రధాన గ్యారంటీలపై ఇవాళ సీఎం సమీక్షిస్తారని మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. ఈనెల 9న సోనియా జన్మదినం రోజున మొదలు పెడతామని మంత్రి శ్రీధర్‌ బాబు చెప్పారు. 24 గంటల విద్యుత్ కార్యాచరణలో పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: