హైదరాబాద్‌ గాంధీభవన్ లో సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. 78 ఏళ్ల సోనియాకు గుర్తుగా 78 కేజీల కేక్ కోశారు. శ్రీమతి సోనియా గాంధీ జన్మదినం తెలంగాణ ప్రజలకు ఒక పండుగ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 9, 2009లో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని ఉక్కు సంకల్పంతో సోనియమ్మ మన ఆకాంక్షలు నెరవేర్చారన్న సీఎం రేవంత్ రెడ్డి .. తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో.. మనం చూడలేదని.. తెలంగాణ తల్లి సోనియమ్మ రూపంలో ఉంటుందని ఆ తల్లి మనకు భరోసా ఇచ్చిందని అన్నారు.


తెలంగాణ ప్రజలు కృతజ్ఞత భావంతో ఉంటారని మొన్నటి ఎన్నికల తీర్పుతో నిరూపించారన్న సీఎం రేవంత్ రెడ్డి .. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రజలు నాకు ఈ బాధ్యత ఇచ్చారన్నారు. సేవకుడిగా ప్రజలందరి ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత నాది అని భరోసా ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి .. కార్యకర్తలకు ఖచ్చితంగా న్యాయం చేస్తానని.. ఈ ప్రభుత్వం ప్రజలది.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన ఉంటుందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: