పులివెందులను జిల్లాగా మార్చేందుకు సీఎం జగన్ ఆదేశాలతో సర్వే జరుగుతోందని ప్రొద్దుటూరు బీజేపీ నేత గొర్రె శ్రీనివాసులు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రి, కదిరి, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు, కమలాపురం నియోజకవర్గాలను కలిపి పులివెందులను జిల్లా చేసేందుకు సర్వే నిర్వహిస్తున్నారని బీజేపీ నేత గొర్రె శ్రీనివాసులు అన్నారు. రాయచోటి జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకు మార్చేందుకు మరో సర్వే జరుగుతోందని కూడా గొర్రె శ్రీనివాసులు అన్నారు.


రాయచోటి జిల్లా కేంద్రం రద్దు అయ్యే అవకాశం ఉందన్న బీజేపీ నేత గొర్రె శ్రీనివాసులు .. ప్రొద్దుటూరును జిల్లా చేసేందుకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డి నోరు మెదపడం లేదన్నారు. ప్రొద్దుటూరుకు వచ్చిన మెడికల్ కళాశాలను పులివెందులకు తరలిస్తే ఎమ్మెల్యే రాచమల్లు ఎందుకు ప్రశ్నించలేదని బీజేపీ నేత గొర్రె శ్రీనివాసులు  ప్రశ్నించారు. 2019లో రూ.30 కోట్లు అప్పులున్నాయన్న ఎమ్మెల్యే రాచమల్లు నాలుగేళ్లలో రూ.150 కోట్లు ఎలా సంపాదించారని బీజేపీ నేత గొర్రె శ్రీనివాసులు  ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: