భారత దేశ అతిపెద్ద బ్యాంక్ sbi తాజాగా తన కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. sbi మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనితో బ్యాంక్‌ లోని ప్రతి సేవింగ్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రతికూల ప్రభావం పడనుంది. బ్యాంకు లోని సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు sbi బ్యాంక్ ప్రకటించింది. దీనితో ఇప్పుడు బ్యాంక్‌ లోని సేవింగ్స్ అకౌంట్లు ఉన్న మొత్తం 44 కోట్ల మంది ఖాతాదారులపై ఎఫెక్ట్ పడుతుంది.

 


SBI తాజాగా సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేట్లను 0.25% గా తగ్గించింది. దీనితో ఇప్పుడు బ్యాంక్‌ లోని సేవింగ్స్ ఖాతాల్లో ఉన్న అన్ని డిపాజిట్లకు కేవలం 2.75% వడ్డీ మాత్రమే లభిస్తుంది. అయితే కొత్త వడ్డీ రేట్లు ఏప్రిల్ 15 నుంచి అమలులోకి రానున్నాయి. అయితే బ్యాంకింగ్ వ్యవస్థలో కావలిసినంత లిక్విడిటీ ఉందని, అందుకే వడ్డీ రేట్లను సవరిస్తున్నామని sbi తెలిపింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్ల డిపాజిట్లపై కేవలం 3% వడ్డీ వస్తోంది.

 


ఇంకోవైపు sbi MCLR రేట్ల తగ్గింపు ఎంతంటే 35 బేసిస్ పాయింట్లుగా ఏప్రిల్ 10 నుంచి అమలులోకి వస్తుందని నిర్ణయించింది. అయితే 2019-20 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ MCLR ను తగ్గించడం ఇది వరుసగా 11వ సారి అవ్వడం ఆలోచించాల్సిన అవసరం ఉంది. sbi MCLR తగ్గింపుతో బ్యాంక్ నుంచి MCLR లింక్డ్ ఫ్లోటింగ్ రేటుతో రుణాలు తీసుకున్న వారికి ప్రయోజనం చేకూరుతుంది. అందులో ముక్యంగా హోమ్ లోన్ వంటివి తీసుకున్న వారికి చాలా వరకు ఉపయోగపడుతుంది. 


 
SBI ఏడాది MCLR ఇప్పుడు 7.4 % కి పడిపోయింది. అయితే ఈ రేటు మాత్రం ఏప్రిల్ 10 నుంచి అమలులోకి రానుంది. ఇప్పుడు MCLR రేటు 7.75 %గా ఉంది. అయితే అర్హత ఉన్న హోం లోన్ అకౌంట్లపై EMI భారం కొద్దివరకు తగ్గుతుంది. 30 సంవత్సరాల కాల పరిమితితో తీసుకున్న హోమ్ లోన్స్‌ పై రూ.లక్షకు EMI పై రూ.24 తగ్గింది. MCLR రేటుతో లింక్ అయిన వాటికే ఇది వర్తిస్తుందని sbi తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: