ఈ మధ్యకాలంలో మనుషులు మానవతా విలువలతో బతకడం కంటే మోసాలకు పాల్పడుతూ జల్సాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఉద్యోగమో వ్యాపారము చేస్తూ సభ్య సమాజంలో గౌరవంగా బతకడం కంటే ఏదో ఒక విధంగా మోసానికి పాల్పడి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తే ఇక అంతకంటే ఇంకేం కావాలి అంటూ ఎంతో మంది నేరాలకు పాల్పడుతూ ఉండటం గమనార్హం. దీంతో నేటి రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని విధంగా మారిపోయింది.


టెక్నాలజీని ఉపయోగించుకుని సైబర్ నేరాలకు పాల్పడే కేటుగాళ్లు కొంతమంది అయితే.. జనాల్లో ఉన్న అమాయకత్వాన్ని వాడుకొని బురిడీ కొట్టించే కేటుగాళ్లు ఇంకొంతమంది. ఇలా నేటి రోజుల్లో ఎంతోమంది కేటుగాళ్ల బండారం బయట పడుతూనే ఉంది. మోసాలకు పాల్పడుతూ పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఎంతోమంది చివరికి పోలీసులకు పట్టుబడి ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. మూడు నెలల్లో మూడు వందల మోసాలకు పాల్పడ్డారు. పెళ్లి పేరుతో ఎంతో మందిని మోసం చేశారు.


 ఈ క్రమంలోనే ఇటీవలే మోసాలకు పాల్పడిన ఓ మ్యాట్రిమోని సంస్థకు చెందిన ఇద్దరు నిందితులను శంకర్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్ నగర శివార్లలో వెలుగులోకి వచ్చింది. నాగపూర్ కు చెందిన రిట అనే 30 ఏళ్ల మహిళ తెలంగాణాలో ఆరు మ్యాట్రిమోనీ కేంద్రాలను నడిపిస్తోంది. ఇక శంకర్ పల్లి కి చెందిన ఒక వ్యక్తి కి ఫోన్ చేయగా  రిజిస్ట్రేషన్ కోసం 3000 చెల్లించాడు సదరు వ్యక్తి. అయితే మళ్లీ సంస్థ నుంచి ఎలాంటి స్పందన రాలేదని దీంతో మోసపోయానని గ్రహించి వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.



 ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు సైబర్ క్రైమ్ సిబ్బంది సహాయంతో ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలో ఉన్న మ్యాట్రిమోని శాఖల పై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో మాట్రిమోని సైట్ లో మేనేజర్ గా పని చేస్తున్న శ్వేతా, హేమంత్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమం లోనే ఇలా పట్టుబడ్డ నిందితులను తమదైన శైలిలో విచారించగా తీగలాగితే డొంక కదిలింది అన్న విధంగా అన్ని నిజాలు బయటకు వచ్చాయి. కేవలం మూడు నెలల సమయంలో 300 మంది మోసగించి 9.8 లక్షల వరకు వసూలు చేసినట్లు పట్టుబడిన నిందితులు విచారణలో ఒప్పుకున్నారు. ఇలా వసూలుచేసిన డబ్బు నాగపూర్ కేంద్రానికి చేరుతుందని అంటూ పోలీసు విచారణలో తెలిపారు. తాము కేవలం ఉద్యోగులం మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు నిందితులు.

మరింత సమాచారం తెలుసుకోండి: