ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...నూడిల్స్ అంటే చిన్న పిల్లలకి ఎంత ఇష్టమో అందరికి తెలుసు. చిన్న పిల్లలకే కాదు పెద్ద వాళ్లకి కూడా నూడిల్స్ అంటే చాలా ఇష్టం. ఇక సమోసా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి దాకా సమోసాని ఇష్టపడని వారు ఉండరు. ఇక ఈ రెండు కలిపి తింటే ఇంకెలా ఉంటుంది. ఆ రుచి మాములుగా ఉండదు. ఈరోజు నూడిల్స్ సమోసా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం...


ముందుగా కావలసిన పదార్థాలు:
మైదా పిండి - పావుకిలో, ఉడికించిన నూడుల్స్ - రెండు కప్పులు, వాము అరటీస్పూను, అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టీస్పూను, క్యాబేజీ తురుము - మూడు స్పూనులు, రెడ్ చిల్లీ సాస్ - ఒక టీస్పూను, సోయాసాస్ - రెండు టీస్పూన్లు, ఉల్లికాడల తురుము - రెండు స్పూనులు, కార్న్ ఫ్లోర్ - ఒక టీస్పూను, క్యారెట్ తరుగు - రెండు స్పూనులు, నీళ్లు - సరిపడినన్నీ, ఉప్పు - తగినంత.

నూడిల్స్ సమోసా తయారుచేసే విధానం....

ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. అందులో క్యాబేజీ తురుము, క్యారెట్ తరుగు, రెడ్ చిల్లీసాస్, సోయాసాస్ వేసి కలపాలి. ఉల్లికాడల తురుము కూడా వేసి వేయించాలి. తరువాత కాస్త ఉప్పు, కార్న్ ఫ్లోర్ వేసి వేయించాలి. అవి వేగాక ఉడికించిన నూడుల్స్ ను వేసి కలపాలి. వేగాక బయటికి తీసి ప్లేటులో పెట్టి... తడి ఎక్కువ లేకుండా ఆరనివ్వాలి.ఇప్పుడు మరో గిన్నెలో మైదాపిండి, ఉప్పు, కాస్త నూనె, నీళ్లు వేసి బాగా కలపాలి. పిండిని ముద్దలా కలుపుకుని మూత పెట్టి కాసేపు అలా ఉంచేయాలి. అరగంట తరువాత ఆ ముద్దని చిన్న ఉండలుగా చేసుకుని పూరీల్లా ఒత్తాలి. పూరీని సగానికి కోసి త్రికోణాకారంలో మడతబెట్టి, లోపల నూడిల్స్ మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసేయాలి. అన్నీ ఇలాగే చేసుకున్నాక... వాటిని నూనెలో డీప్ ఫ్రై చేయాలి. వీటిని టమాటో సాస్ తో తింటే భలే రుచి ఉంటాయి.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రుచికరమైన వంటకాల గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: