ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..ఈ చలికాలంలో కొన్ని వంటకాలు ఎంతో రుచికరంగా ఉంటాయి. వాటిలో బీట్ రూట్ తో చేసిన కబాబ్స్ ఒకటి అయితే, రెండవది చిలకడదుంప రబ్డీ.. ఇక రెండు వంటకాలు కేవలం రుచికే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. ఇక ఇవి ఎలా చెయ్యాలో తెలుసుకుందాం...
చిలగడ దుంప రబ్డీకి కావలసినవి....
పాలు – ఒక కప్పు; ఉడికించిన చిలగడ దుంపల ముద్ద – 2 టేబుల్ స్పూన్లు; పంచదార – అర టీ స్పూను; గోరు వెచ్చని నీళ్ళు – అర కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూను; కుంకుమ పువ్వు – చిటికెడు; పల్లీ, పిస్తా, జీడిపప్పుల పొడి – ఒక టేబుల్ స్పూన్.
చిలగడ దుంప రబ్డీ తయారు చేయు విధానం...
ముందుగా స్టౌ మీద గిన్నెలో పాలు పోసి, మరిగించాలి.ఉడికించిన చిలగడ దుంప ముద్ద జత చేసి, పాలు చిక్కబడే వరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించాలి.చిన్న కప్పులో గోరు వెచ్చని నీళ్ళలో కుంకుమ పువ్వు వేసి, కరిగించి, మరుగుతున్న పాలలో వేసి కలియబెట్టాలి.ఏలకుల పొడి జతచేయాలి.పల్లీ, పిస్తా, జీడిపప్పల పొడి జత చేసి, కలిపి దింపేయాలి.చల్లారాక, ఫ్రిజ్‌లో గంట సేపు ఉంచి, తీసి అందించాలి.
బీట్ రూట్ కబాబ్ తయారీకి కావాల్సిన పదార్ధాలు....
ముందుగా బీట్ రూట్ తురుము – ఒక కప్పు; టోఫు – అర కప్పు (తురమాలి); వెల్లుల్లి ముద్ద – అర టేబుల్ స్పూను; ఆమ్ చూర్ పొడి – ఒక టేబుల్ స్పూను; వేయించిన దానిమ్మ గింజల పొడి – ఒక టేబుల్ స్పూను; చాట్ మసాలా – చిటికెడు; రాళ్ళ ఉప్పు – తగినంత; జీడిపప్పు పలుకులు – పావు కప్పు; ఓట్స్ పొడి – అర కప్పు; నూనె – డీప్ ఫ్రైకి తగినంత.
బీట్రూట్ కబాబ్ తయారి విధానం.......
ముందుగా ఒక పాత్రలో బీట్ రూట్ తురుము, టోఫు తురుము, వెల్లుల్లి ముద్ద, ఆమ్‌చూర్ పొడి, చాట్ మసాలా, ఉప్పు, దానిమ్మ గింజల పొడి వేసి, బాగా కలిపి, చేతితో కట్‌లెట్ మాదిరిగా ఒత్తాలి.ఒక్కొక్క దానిలో జీడిపప్పు పలుకులు వేసి, కబాబ్ మాదిరిగా గుండ్రంగా చేయాలి.ఓట్స్ పొడిని అద్దాలి∙స్టౌపై బాణలిలో నూనె కాగాక, కబాబ్స్‌ని అందులో వేయించి, కిచెన్ న్యాప్‌కిన్ మీదకు తీసుకోవాలి.గ్రీన్ చట్నీతో వేడిగా వేడిగా తింటే చాలా బాగుంటుంది...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి