నెల్లూరు జిల్లా మనుబోలు మండలం రాజవోలుపాడులో జూన్ 20న ఇద్దరు కవలలు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. అమ్మ కలిపి ఇచ్చిన డబ్బాపాలు తాగిన కొద్దిసేపటికే పిల్లలు విగతజీవులయ్యాయి.ఆసుపత్రికి తీసుకెళ్లినా అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. పాలల్లో విషం కలిసిందని వైద్యులు నిర్థారించారు. భార్యే అక్రమసంబంధానికి అడ్డుగా ఉన్నారని పిల్లలను చంపిందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ భార్య భర్తే తనపై అనుమానంతో కన్నబిడ్డలను హత్యచేశాడని ఆరోపిస్తుంది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
భర్తే భార్యపై అనుమానం పెంచుకుని కన్నబిడ్డలను హతమార్చినట్లు విచారణలో వెల్లడైంది. పక్కా ప్లాన్ తో పాలడబ్బాలో విషం కలిపాడు. విషయం తెలియని తల్లి అదే పాలడబ్బాను పిల్లలు పట్టించింది. కవలలు కన్నుముశారు. ఇది జరిగింది. కానీ.. రివర్స్ లో భర్త భార్యపై కేసుపెట్టాడు. అక్రమసంబంధంకు అడ్డుగా పిల్లలు ఉన్నారని వారిని తన భార్య హతమార్చిందని వాపోయాడు. ఇలానే అందరిని నమ్మించే ప్రయత్నంచేశాడు. కానీ భార్య గట్టిగా తనకు ఏ పాపం తెలియదని..హత్య చేయలేదని పదే పదే చెప్పింది. తనపై భర్తకు ముందు నుంచి అనుమానం ఉందని చెప్పడంతో పోలీసులు భర్తను తమదైన స్టైల్లో విచారించే సరికి అసలు విషయం బయటపడింది. తానే హత్య చేసినట్లు పోలీసులు ఎదుటు ఒప్పుకున్నాడు. విచక్షణ మరిచి ఓ కసాయి తండ్రి చేసిన పనికి ఆ తల్లి ఇద్దరు కవలలను కోల్పోయింది. కనిపెంచిన పిల్లలు కళ్లముందే చనిపోయేసరికి ఆమె బోరున విలపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి