ఇప్పటివరకు సరిగ్గా పరీక్షలు రాయలేక చివరికి ఫెయిల్ అయిన విద్యార్థులు మనస్థాపంతో ఆత్మహత్యలు చేసుకోవడం లాంటి ఘటనలు చూశాము. ఇలాంటి ఘటనలు ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతూ ఉంటాయ్. ఇక పరీక్షలకు సంబంధించిన ఫలితాలు విడుదలైన ప్రతి సారి కూడా ఇలాంటి ఆత్మహత్యలకు సంబంధించిన ఘటనలు వెలుగులోకి వస్తూ ఉంటాయి  కానీ ఇక్కడ మనం మాట్లాడుకునేది మాత్రం అంతకు మించినా హృదయ విదారక ఘటన అని చెప్పాలి. ఆమె కుటుంబం కోసం ఎంతో బాగా చదివి మంచి ఉద్యోగం సాధించి అమ్మానాన్నలను ఎంతో సంతోషంగా చూసుకోవాలి అని అనుకుంది.


 కానీ ఆ విద్యార్థిని పట్టుదలను చూసి విధి ఓర్వలేక పోయింది. చివరికి ఎన్ని సమస్యలు ఎదురైనా ఎంతో బాగా చదువుతున్న విద్యార్థిని ప్రాణాలు తీసింది విధి. ఘటన ఎంతోమందిని కంటతడి పెట్టించింది. ఎంతో బాగా చదివి బాగా ఇంటర్ పరీక్షలు రాసింది సదరు విద్యార్థి. కానీ ఇక చివరి పరీక్ష రాసి ఇంటికి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం రూపంలో ప్రాణం పోయింది. అయితే ఇటీవలే విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఆమెకు ఏకంగా 867 వచ్చి ఏకంగా టాపర్గా నిలిచింది. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం మునగాల కు చెందిన నల్లన్న కుమార్తె రాజేశ్వరి జిల్లా కేంద్రంలోని కేజీబీవీ లో ఇంటర్ చదువుతోంది.


 అయితే ఇటీవల ఇంటర్ పరీక్షలు సందర్భంగా ఎంతోబాగా పరీక్షలు రాసింది. ఇక మే 19వ తేదీన పరీక్షలు ముగిసిన తర్వాత తన తండ్రి రాజేశ్వరిని బైక్ పై ఎక్కించుకుని గద్వాల నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. అయితే మార్గమధ్యంలో ఆర్టిసి బస్సు ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా ఇటీవల విడుదలైన ఫలితాలలో రాజేశ్వరి ఎంపిసీ లో 867 మార్కులు సాధించి కేజీబీవీల్లో టాపర్గా నిలవడం గమనార్హం. దీంతో ఇక రాజేశ్వరి ని గుర్తు చేసుకుని అధ్యాపకులు తోటి విద్యార్థులు కూడా కన్నీటిపర్యంతమయ్యారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: