
అయితే తన కడుపున పుట్టిన పిల్లలు పెరిగి పెద్దయి ప్రయోజకులు అయిన తర్వాత కూడా తల్లికి మాత్రం చంటి పిల్లల్లాగానే కనిపిస్తారు అనడంలో సందేహం లేదు. అందుకే తన ఊపిరి ఉన్నంతవరకు తన పిల్లలని కాచుకొని ఉంటుంది తల్లి. అలాంటిది ఇక ఇలా అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు కళ్ళముందే చనిపోతే ఇక ఆ తల్లి గుండె ఆగిపోయినంత పని అవుతూ ఉంటుంది. ఇక్కడ ఒక తల్లికి ఇలాంటి ఒక దారుణమైన పరిస్థితి ఎదురైంది. కొడుకే ప్రాణంగా బతికింది ఆ తల్లి. కానీ ఈ తల్లి కొడుకుల బంధం చూసి విధి ఓర్వలేకపోయింది.
చివరికి కొడుకు ప్రాణం తీసేసింది. ఇక ఈ విషయాన్ని జీవించుకోలేకపోయిన తల్లి గుండె ఆగిపోయింది. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో వెలుగులోకి వచ్చింది. నేదునూరుకు చెందిన కనక లక్ష్మీ కొడుకు శ్యాంసుందర్ కు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ గోదాం గడ్డ కాలనీకి చెందిన శారదతో వివాహం జరిగింది. కాగా ఏడు నెలల క్రితం శ్యాంసుందర్ భార్య శారద ఆత్మహత్య చేసుకుంది. అయితే భార్యను మరిచిపోలేకపోయిన శ్యాంసుందర్ సైతం.. ఇటీవల సూసైడ్ చేసుకున్నాడు. అయితే కొడుకు మరణాన్ని ఆ తల్లి జీర్ణించుకోలేకపోయింది. దీంతో ఇక కొడుకు అంత్యక్రియలు పూర్తయిన వెంటనే ఆ తల్లి గుండె ఆగిపోయింది.