ఇండియా లో జరిగే క్రైమ్స్ లో ఎక్కువ అక్రమ సంబంధాలే ఉంటున్నాయి. పరాయి వాళ్ల మోజు లో పడి పచ్చని సంపారాల్లో చిచ్చు పెట్టుకుంటున్నారు. ఈ అక్రమ సంబంధాల వల్ల హత్యలు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పెళ్లి తరువాత కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారిలో ఎక్కువగా పెళ్ళైన వాళ్లే ఉంటున్నారు. భర్తలకు, భార్యలకు మరొకరితో సన్నిహితం గా ఉంటూ అడ్డంగా బుక్కవుతున్నారు. రెడ్ హ్యాండెడ్ గా దొరికినప్పుడు ఎన్నో వీడియోలు వైరల్ కూడా అయ్యాయి. అయితే సగానికి పైగా ఇటువంటి వార్తలు బయటికి రావడం లేదు. ఎక్కడ పరువు పోతుందో అని ఇంట్లోనే పరిష్కరించుకున్న కేసులు కూడా ఉన్నాయి. మరికొన్నైతే ఎక్కడ పరువు పోతుందో అని ఆత్మహత్య చేసుకున్న కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి సంఘటనే వేముల వాడలో కలకలం రేపుతోంది. భర్త మరో మహిళ తో ఉండగా భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. దీంతో భర్త మరో మహిళ తో అడ్డంగా బుక్కయ్యాడు. దీంతో ఆ జిల్లాలో ఇప్పుడిదే హాట్ టాపిక్ అయ్యింది. భర్తని పట్టుకొని పోలీసులకు అప్పగించింది. ఈ ఘటనకి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వేములవాడలో ఒక జంట మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉండేవి. దీనికి కారణం తన భర్త అక్రమ సంబంధం అని భార్యకి తెలిసింది. బుధవారం రోజు సాయినగర్ లో సదరు వివాహేతతో ఉన్నాడని తెలుసుకొని భార్య వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఒక గదిలో మరో మహిళతో సన్నిహితంగా ఉన్న భర్తని పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టించింది. మరో మహిళతో సంబంధం పెట్టుకొని తనని రోజు వేధిస్తున్నాడని, తన భర్తని శిక్షించాలని, తనకి న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నట్టు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: