12 రాజ్యసభ స్థానాలు అంటే దేశంలోనే కాంగ్రెస్, బీజేపీ తర్వాత మూడో స్థానానికి వైసీపీ చేరుతుంది. దీని వల్ల రాజ్యసభ లో పార్టీ బలం పెరుగుతుంది. ఏదైనా చట్టం చేయాలన్నా, వద్దనుకున్న వైసీపీకి అవకాశం వస్తుంది. కాబట్టి రాజ్యసభ సీట్లపై వైసీపీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సజ్జల కూడా తొమ్మిది నెలల్లో సాధారణ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలు చురుగ్గా ఉండాలని దిశా నిర్దేశం చేశారు.
దీంతో జగన్ ముందస్తుకు వెళ్లడని తేలిపోయింది. కాబట్టి ఈ తొమ్మిది నెలల కాలంలో ప్రతిపక్షాల తీరును ఎండగట్టేలా.. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను ప్రజలకు వివరించేలా ప్రయత్నాలు చేయనున్నారు. అదే సమయంలో టీడీపీ, జనసేన పార్టీల నుంచి వస్తున్న విమర్శలను ధీటుగా తిప్పికొట్టడం, ప్రజలకు ఎక్కడ ఏ అవసరం ఉందో గమనించడం తద్వారా పార్టీని ప్రజల్లో నిలపడం లాంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు.
వచ్చే తొమ్మిది నెలలు వైసీపీ కి కీలకం కానుంది. జగన్ అనుకున్నట్లు 175 స్థానాలు గెలవాలంటే పార్టీలోని వ్యతిరేక వర్గంని సైతం కలుపుకుపోవాలి. అసంతృప్తులను బుజ్జగించాలి. సంక్షేమ పథకాల తీరును వివరించగలగాలి. వాలంటీర్ల, సచివాలయ వ్యవస్థతో పాటు నాడు నేడు, అమ్మ ఒడి లాంటి పథకాలు మరింత ప్రజల్లోకి వెళ్లగలిగేలా చేయాలి. దీంతో పాటు ఏయే నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు బలహీనంగా ఉన్నారో చూసి వారిని ప్రజల్లోకి వెళ్లి క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించాలని సూచిస్తే రాబోయే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి