
కానీ చెప్తున్న లెక్కేమిటంటే రూ.3500 కోట్ల స్థాయిలో ఉందని కేంద్రమే చెప్పినట్లు ఎల్లో మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కానీ సీమెన్స్ సంస్థ మాత్రం తమకు ఏం సంబంధం లేదు అని చెప్తోంది. రూ.3వేల కోట్లు వచ్చిన లెక్క కూడా లేదు. జరిగిన వాదనల్లో కూడా రూ.371 కోట్లలో సంస్థ శిక్షణ ఇచ్చిందా లేదా అనే అంశంపై చంద్రబాబు తరఫున వాదన నడిచింది. ఇందులో చంద్రబాబుకు ఏం సంబంధం అని , అవినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్ 17 ఏ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోకుండా అరెస్టు చేశారు అని అతని తరఫున న్యాయవాదులు వాదించారు.
అరెస్టు విషయంలో ముందస్తు అనుమతి తప్పనిసరి అనే అంశమే ఈ రోజు వాదనల్లో కీలకాంశంగా చర్చించారు. రూ.371 కోట్లతో పని జరిగింది అని కూడా స్పష్టం చేయడం లేదు. బోస్ అనే వ్యక్తి ఇచ్చిన ఇంటర్వ్యూలో రూ.371 కోట్లు విడుదల చేశామని చెప్తున్నారు. వాటిలో రూ.100 కోట్లతో సీమెన్స్ దగ్గర కొనుగోలు చేశామని పేర్కొంటున్నారు. అసలు సీమెన్స్ కంపెనీ నే రూ.3300 కోట్లు ఉచితంగా ఇవ్వాలి. వాటి నుంచే రూ.370 కోట్లతో ఈ స్కిల్ డెవలప్ మెంట్ ను విస్తరించాలి.
జాగ్రత్తగా గమనిస్తే ఈ కేసులో విషయం అంతా పక్కదారి పట్టినట్లు కనిపిస్తోంది. పత్రికల్లో రాసేది ఒకటి కోర్టులో జరిగేది మరొకటిలా ఉంది. ప్రభుత్వం సరిగా వాదించడం లేదా, వారి వాదనలో డొల్లతనం ఉందా.. లేక టీడీపీ తరఫున వాదించే లాయర్లు పక్కదోవ పడుతున్నారా అనేది అర్థం కావడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.