తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు ఎంత సంచలనం సృష్టించిందో మన అందరికీ తెలిసిందే. ఏకంగా అప్పటి సీఎం చంద్రబాబు కేసులో ఇరుక్కోవడంతో తెలుగునాట కలకలం రేపింది. అయితే ఈ కేసులో రేవంత్ రెడ్డి కొన్ని నెలల పాటు జైల్లో ఉండి ఆతర్వాత బెయిల్ పై బయటకి వచ్చారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ బ్రహ్మదేవుడు వచ్చినా చంద్రబాబు నాయుడిని కాపాడలేరు అన్నారు. కానీ అనూహ్యంగా ఈ కేసు మరుగున పడింది. రేవంత్ రెడ్డి పై ఈ కేసు ప్రభావం లేదు ఎందుకని అని పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పటికీ బీఆర్ఎస్ నేతలు ఓటుకు నోటు కేసు అంశం ప్రస్తావనకు తీసుకువస్తూనే ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏమాయ చేశారు. కేసు నుంచి ఎలా తప్పించుకున్నారు అనే అంశాలపై టీపీసీసీ చీఫ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.


ఈ కేసులో తానేమీ తప్పించుకోలేదని.. న్యాయస్థానం ముందు అందరు నిలబడాల్సిందే అని వ్యాఖ్యానించారు. కేసు అక్రమమా సక్రమమా అనేది పక్కన పెడితే ఈ అంశంపై సుప్రీంకోర్టు లో స్టే ఉంది. ఎందుకు ఉంది అంటే ఓటుకు నోటు కేసు అనేది సీఆర్పీసీ కిందకు వస్తుందా.. లేక పీపుల్స్ రిప్రంజెంటివ్ చట్టం కిందకు వస్తుందా అనే అంశం ముందు తేలాలి.  విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే సీఎఆర్పీసీ చట్టం వర్తిస్తుంది.


ఓటు వేసేందుకు ఏదైనా ప్రలోభాలు ఆశ చూపెడితే ఆ కేసును ఏసీబీ అధికారులు విచారిస్తారా లేక ఎన్నికల అధికారులు విచారిస్తారా. అందుకే నేను సుప్రీంకోర్టుని ఆశ్రయించాను. ఈ కేసుకు సంబంధం లేని సంస్థలు విచారిస్తున్నాయి. ఉదా. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తిపై మర్డర్ కేసు పెడితే ఎలా ఉంటుందో నాపై కూడా సంబంధం లేని కేసు పెట్టి ఇరికించారు. అందుకే నేను కోర్టుని కోరాను.  ఏ అంశమై కేసు పెడితే ఆ కోర్టు పరిధికి వెళ్తాను అని సుప్రీంకోర్టుకు విన్నవించుకున్నాను అంతే తప్ప మరే ఇతర కారణాలు లేవని రేవంత్‌ రెడ్డి చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: