హైదరాబాద్‌ పై పట్టుబిగించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. త్వరలో మోడీ తో సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని భాషాపరమైన మైనార్టీలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్‌లోని తెలుగుయేతర ప్రజలతో సమ్మేళనాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు ఓ రూట్ మ్యాప్  తయారు చేసింది. హైదరాబాద్ లో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాధ్ జులై 1న 2వందల మందితో సమావేశం అవుతున్నారు.


అలాగే జులై 1న సికింద్రాబాద్ హర్యానా భవన్ లో హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ హర్యానావాసులతో సాయంత్రం సమావేశం అవుతారు. జులై 1న హైదరాబాద్ జీకే ఫంక్షన్ హాల్లో కేంద్ర మంత్రి ఎన్. మురుగన్,అన్నామలై,పోను రాధాకృష్ణన్ హైదరాబాద్‌లోని తమిళనాడు వాళ్ళతో సమ్మేళనం నిర్వహించనున్నారు. జులై 2న ఈశాన్య రాష్ట్రాల అస్సాం ముఖ్యమంత్రి హేమంతా బిశ్వ శర్మ 2వేల మంది ఈశాన్య రాష్ట్రాలకు చెందిన హైదరాబాద్ వాసులతో  సమావేశం కానున్నారు.


జులై 1న రాంకోఠిలోని గుజరాతీ భవన్ లో 6వందల మందితో గుజరాత్ ముఖ్యమంత్రి గుజరాతీలతో సమావేశం అవుతారు. జులై 1న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ కూకట్ పల్లిలో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. జులై 1న రాజస్థాన్ కు సంబంధించిన 3వేల మందితో శంషాబాద్ ఎస్ఎస్ కన్వెనషన్లో వసుంధర రాజే సమావేశం నిర్వహించున్నారు. అలాగే జులై 2న కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై, యడ్యూరప్ప రాం కోఠిలోని కర్ణాటక సాహిత్య మందిర్ లో సమావేశం నిర్వహిస్తారు.


జులై 2న కశ్మీర్ పండిట్ ల సమావేశం హైటెక్ సిటీలో నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇలా హైదరాబాద్‌లో నివాసం ఉంటే ఇతర రాష్ట్రాల వారితో ఆయా ప్రాంతాల నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి.. వారి ఓటు బ్యాంకును ఆకర్షించే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. మరి ఇది ఎంత వరకూ ఫలిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp