భారతదేశ చరిత్రలో కనివిని ఎరుగని విధంగా ఎంతోమంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా స్వతంత్రం కోసం గొప్ప గొప్ప పోరాటాలు చేశారు. ఓ వైపు నెత్తురోడుతున్న భరతమాత కోసం తన ఆఖరి శ్వాస వరకు పోరాడి స్వాతంత్య్రం తెచ్చారు. స్వతంత్రం రాకముందు ఒక పరిస్థితి అయితే స్వాతంత్రం వచ్చాక మన పరిస్థితి పూర్తిగా మారుతుందని ఆ మహానుభావులు నమ్మారు. దానికి తగ్గట్లుగానే సొంత పరిపాలన, సొంత ఆలోచనలు ప్రజల్లో రావడం మొదలయ్యాయి. భారతదేశ భవిష్యత్తు మరో స్థానానికి వెళ్లడం ఖాయం తాము చేసిన త్యాగానికి ప్రతిఫలం దక్కింది అని అనుకున్నారు.

అంతేకాకుండా పోరాటయోధులు కోరుకున్న ఫలితం కళ్ల ముందు కనిపించే సరికి వారిలో ఆనందం నెలకొని ఉంది. కానీ ఆ ఆనందం ఎంతో సమయం లేదు. కులమతాల సంఘర్షణలు, బీద ధనిక తారతమ్యాలు వంటివి ప్రజల్లో మొదలై మునుపటి కంటే మరింత దారుణమైన స్థితికి భారతదేశం వెళ్ళింది. ముఖ్యంగా అణగారిన వర్గాలను కాపాడుకోవడం లో భారత్విఫలమైందని ప్రపంచ దేశాలు అపహాస్యం చేశాయి. పేదలను రోజురోజుకు దోచుకుంటున్న క్రమంలో అంబేద్కర్ పేదల పాలిట దేవుడిగా అవతరించాడు. రిజర్వేషన్లను తీసుకు వచ్చాడు. అణగారిన వర్గాలకు అండగా నిలిచి వెనుకబడిన తరగతుల శ్రేయస్సు కోసం వారి పురోగతి కోసం పాటు పడ్డాడు.

అప్పటి పరిస్థితులకు అనుగుణంగా వెనుకబడిన తరగతులకు అండగా నిలిచి వారికి బాసటగా ఉన్నాడు. కులమనే పదమే భారత రాజ్యాంగంలో ఉండడానికి వీలు లేదు అని తన కలల భారతంలో కల కన్నాడు. కులం లేని భారత దేశాన్ని చూశాడు. కానీ ఆ కులం అనే మహమ్మారి ఇప్పటికీ కొనసాగుతూ ఆ మహనీయుడు కన్న కలను చేడిపేస్తుంది. ఆయన రాసిన రాజ్యాంగం లోని ప్రతి ఒక్క విషయం బయట ఏమాత్రం ఆచరణ కావట్లేదు అన్నది అసలు నిజం. అంబేద్కర్ కలలు కన్న రాజ్యాన్ని భారత దేశంలో ఎప్పుడు చూడగలమో ఏమో.

మరింత సమాచారం తెలుసుకోండి: