
చైనా వాళ్ల బేస్ క్యాంపు బీజింగ్ లో ఉంది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే వరకు చాలా సమయం పడుతుంది. మాకు నాలుగు యుద్ధ విమానాలు ఇవ్వండి బాబోయ్ అని సైనికులు మొత్తుకున్న ఇవ్వలేని దుస్థితి ఆనాటిది. అప్పటి రక్షణ మంత్రి చేతకాని తనం వల్ల చైనా మీద ఓడిపోయామంటారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి భారత్ వద్ద అయితే లేదు. దాదాపు రూ.90,వేల కోట్ల రూపాయాలు కేంద్రం సైన్యం, రక్షణకు ఇస్తోంది. ఆయిల్, మందుగుండు, యుద్ధ నౌకలు, యుద్ధ ట్యాంకులు, మిస్సైల్స్, అన్నింటిని సమకూర్చుకోవాలని చెబుతోంది.
ఎప్పుడు యుద్ధమొచ్చిన వెనక్కి తగ్గేది లేదని ఏ క్షణమైనా సిద్ధంగా ఉండేందుకు యుద్ధ సామగ్రిని సైన్యానికి అందజేస్తుంది. గతంలో జరిగిన యుద్ధ సమయంలో ఏ పొరపాటు వల్ల చైనాపై ఓడిపోయామో అది ప్రస్తుతం జరగకుండా ఉండేందుకు రక్షణ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించేందుకు భారత్ సన్నద్ధమవుతుంది. ఒకవేళ చైనాతో యుద్దం వస్తే వారికి ధీటుగా సమాధానం చెప్పేందుకు ఇండియా సర్వసన్నద్ధంగా ఉందని సైన్యానికి కూడా భరోసా ఇచ్చేందుకు కేంద్రం అన్ని విధాల సహకరిస్తుంది.