ప్రతిపక్షపు ప్రోత్సాహకుల లిస్ట్ లో ఉంటూ దేశానికి ఉపయోగపడే ఏ విషయాన్నైనా వ్యతిరేకంగా వ్రాస్తూ క్రమంగా జర్నలిజం అంటే దేశద్రోహాన్ని తలిపించే విధంగా మార్చుతున్న రోజులు ఇవి. ఒకరో, ఇద్దరో, లేదా కొంత మందో కాస్త పాజిటివ్ గా మన దేశం గురించో, మన రాష్ట్రం గురించో రాస్తున్న పద్ధతిని గమనిస్తున్నాం కూడా. అదే సమయంలో తప్పు విషయాన్ని తప్పుగా చూపించడం, రాయడం తప్పు కాదు. వదంతుల్ని బేస్ చేసుకుని వాటిని నిజాలుగా తప్పుగా చూపించడం పెద్ద తప్పు.


నిజం చెప్పాలంటే మనం ఉండే రాష్ట్రం, ఇంకా మన ప్రక్క రాష్ట్రం కూడా బాగుండాలి అనుకోవాలి కానీ, ప్రతీ చిన్న విషయాన్ని ఫ్లాష్ న్యూస్ ల పేరుతో, మరొక పేరుతో భూతద్దంలో బూతులా చూపించకూడదు. అంటే ఉన్న దాన్ని ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి, చెప్పాలి, చూపించాలి. అదే జర్నలిజం. . మంచిని మంచిగా, చెడును చెడుగా చూపించాలి. అగ్ని పథ్, అగ్ని వీర్ అనేటువంటివి ఈ దేశపు ప్రయోజనాల గురించి, సైనిక అవసరాల గురించి ఉన్నవి.


సైన్యంలో సుధీర్ఘ కాలం పాటు ఉన్న పెన్షన్ల కార్యక్రమాల వరకు ఇవి నడుపుకుంటూ పోతుంటే, ఈ దేశానికి భారం అయిపోయిందన్న వాదన ఉంది.  అవసరమైన సైనికులు మనకు ఉన్నారు కానీ, వారు ఆయుధాలను అడిగితే వాటికి కూడా మనం డబ్బులు లేవని అంటున్నాం. దానికి బదులుగానే అగ్ని వీర్ అనే సిస్టం వచ్చింది. దీన్ని కాస్తా తప్పు మార్గంగా చూపిస్తున్న కొన్ని మీడియాలు అగ్ని వీర్ కి ఎవరూ రాలేదు అని చెప్తున్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే అగ్నిపథ్ కి ఒక్క ఆదిలాబాద్ జిల్లా నుండే 7,000 మంది పోటీ పడితే కేవలం 12 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయ్యిన వాళ్లలో ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఇది వరకటిలాగా నిరక్షరాస్యులు లేదా చదువుకున్న మూర్ఖుల ప్రభావం నుండి ఆల్రెడీ బయటకు వచ్చేసారు ఈ దేశపు యువత.


మరింత సమాచారం తెలుసుకోండి: