
ఏకంగా ఎంపీ కుమారుడిని, భార్యను కిడ్నాప్ చేసి రూ. 50 కోట్లు డిమాండ్ చేశారు. ముందుగా ఆ రౌడీ షీటర్ ఎంపీ కొడుకును కిడ్నాప్ చేయడం అనంతరం కొన్ని డబ్బులు తీసుకుని ఎంపీ భార్యను కిడ్నాపర్ల ప్లేస్ కు రమ్మనడం, ఆమె వెళ్లగానే మరిన్ని డబ్బులు అడగడం లాంటివి జరిగిపోయాయి. ఎంపీ భార్యను విడిపించేందుకు ఎంపీ ఆడిటర్ అయినా జీవీ డబ్బులు తీసుకుని వెళుతుండగా ఎంపీ పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో కిడ్నాపర్లను ట్రాక్ చేసి పట్టుకున్నారు.
ఎంపీ భార్య, కొడుకు కూడా కిడ్నాప్ అవుతుంటే రౌడీ షీటర్లను ఏం చేస్తున్నారని ప్రభుత్వం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఎంపీల భార్యలు, పిల్లలకే రక్షణ లేకుంటే ఇక సామాన్య ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారని జగన్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువయ్యాయి. ఎంపీ ఆడిటర్ జీవీ సీఎం జగన్ కు సన్నిహితుడని ఇంత జరుగుతుంటే జగన్ కు చెప్పకుండా ఉండటం ఏమిటనే విమర్శలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా జగన్ పై నమ్మకం లేకపోవడంతోనే చెప్పలేడని ప్రతి పక్షాలు అంటున్నాయి.
రాష్ట్రంలో ఎంపీ కుటుంబ సభ్యులనే కిడ్నాప్ చేస్తున్న రౌడీ షీటర్లను ఏం చేయకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ రౌడీషీటర్ గతంలో కార్పొరేటర్ ను హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడని తెలుస్తోంది. అతడిపై ఫోన్ల చోరీ కేసు నుంచి ఎన్నో కేసులు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.